twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SV Ranga Rao Birth Anniversary: ఎస్వీఆర్‌కు భావోద్వేగంగా పవన్ కల్యాణ్ నివాళి

    |

    తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన మహానటుడు ఎస్వీ రంగారావుకు ఎవరూ సాటిరారనే విషయం కొత్తగా చెప్పాల్సిందే. నటుడిగా ఆయన వాచకం, హావభావాలు తెలుగువారినికి ఎంతో ఆనందాన్ని, స్పూర్తిని కలిగిస్తాయి. దేశంలోనే గొప్ప నటుడిగా పేరు సంపాదించుకొన్న ఎస్వీ రంగారావు జన్మదినం సందర్భంగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన నటనా ప్రతిభను, సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో...

    తెలుగు చలన చిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో అగ్రగణ్యులు శ్రీ ఎస్వీ రంగారావు. చిన్నపాటి ప్రభావశీలమైన హావభావంతోనో, కఠిన సమాసాలతో కూడిన ఎంత పెద్ద సంభాషణనైనా అలవోకగా పలికి మొత్తం సన్నివేశాన్ని రక్తి కట్టించిన ప్రతిభాశీలి ఎస్వీఆర్ గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఏ మాధ్యమంలో చూసిన ఆయన నటించిన చిత్రాలు వాటి విశేషాలే. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ గారిని స్మరించుకొంటూ వారికి నా తరఫున, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘీకం అనే తేడా లేకుండా ఏ తరహా పాత్ర పోషించినా వారి అభినయం అనితర సాధ్యం. నిండైన ఆయన రూపం ప్రతి తెలుగువాడి మదిలో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.

    Pawan Kalyan great tribute to Legendary actor SV Ranga Rao

    ఎస్వీఆర్ ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా, ఏ పాత్రనైన జీవం పోసి ఆ పాత్రకు ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనే విధంగా చేశారు. కాబట్టి నేటికి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, నేపాళ మాంత్రికుడిగా, హిరణ్య కశిపుడిగా, అక్బర్, భోజరాజు, తాండ్రపాపారాయుడు, తాతగా ఏ పాత్రలోనైనా ఎస్వీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. ఒక నటుడిగా ఎస్వీఆర్ చిరకీర్తిని ఆర్థించారు. ఆయనను రాబోయే తరాలు కూడా స్మరించుకొంటూనే ఉంటాయి అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో కీర్తించారు.

    English summary
    Power Star and Jana Sena Chief Pawan Kalyan great tribute to Legendary actor SV Ranga Rao. He recollected SVR's acting legendary on his birth Anniversary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X