OG Trailer Review: OG ట్రైలర్.. పవన్ ఊచకోత.. ఈ 5 విషయాలు గమనించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ They Call me OG. ఈ చిత్రం కోసం ప్రస్తుతం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓజీ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ తో మరింతగా అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. ఇక సెప్టెంబర్ 21నే ఓజీ ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ చెప్పినప్పటికీ విడుదల కాలేదు. ఉదయం రాకపోగా.. ఓజీ కాన్సెర్ట్ లోనూ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పి కూడా విడుదల చేయలేదు.

ఇక సెప్టెంబర్ 22న ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. సోషల్ మీడియాలో ట్రైలర్ కోసం నానా రచ్చ చేశారు. అయితే పలు టెక్నీకల్ ఇష్యూ కారణంగా ఓజీ సినిమా ట్రైలర్ అప్పుడు విడుదల కాలేదని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 22న 2:30కు ట్రైలర్ ను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. దీంతో ఓజీ ట్రైలర్ క్షణాల్లోనే యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ ను దక్కించుకుంటోంది.

Pawan kalyan OG Movie Trailer Review

OG Trailer కట్ విషయానికొస్తే సుజీత్ చాలా బ్రిలియంట్ గా ట్రైలర్ ను రెడీ చేశారని తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో ముంబైలో ఆగిపోయిన గ్యాంగ్ వార్స్, మాఫియా మళ్లీ మొదలవుతుంది. గన్స్, ఇతర ఆయుధాలను ఇమ్రాన్ హష్మీ, అతని అనుచరుల ఆధీనంలోకి వెళ్తుంది. నానా రక్తపాతం సృష్టిస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఓజాస్ గంభీరా తిరిగి ముంబైలో అడుగుపెడుతారు. తన ప్రత్యర్థి ఒజాస్ ను ఎదుర్కొంటాడు... ఇలా సినిమా కథకు సంబంధించిన సారాంశాన్ని ట్రైలర్ కట్ లో అర్థమయ్యేలా చూపించారు.

ట్రైలర్ విడుదలైన సందర్భంగా ప్రధానంగా 5 అంశాలు ఆకట్టుకుంటున్నాయి. 1.పవన్ కళ్యాణ్ ముంబైకి తిరిగి రావడం అంటే.. గతంలో ఎక్కడ ఉన్నారు? అసలు జపనీస్ భాష ఆయనకు ఎలా ఒంటబట్టిందనే విషయం ఆసక్తికరంగా మారింది. 2.ఓజీ చిత్రంలో కొన్నాళ్ల నుంచే అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ ఉంది. 3.తొలిసారి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ హష్మీని సుజీత్ చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారనేది తెలుస్తోంది. 4.రెట్రో లుక్, అవుట్ ఫిట్స్, గన్స్, యాక్షన్ తో పవన్ కళ్యాణ్ ను సుజీత్ నెవెర్ బిఫోర్ గా ప్రజెంట్ చేయబోతున్నారని అర్థమవుతోంది. 5. కథ కూడా చాలా బలంగా ఉండటం, థమన్ సంగీతం, సీజీ, డీఐ వర్క్ కూడా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.

ఈ అంశాలతో పాటు సుజీత్ తనదైన శైలిలో డైలాగ్స్ ను వినిపించబోతుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఓజీ వస్తున్నాడు తలలు జాగ్రత్త.. వంటి డైలాగ్స్ తో పాటు ఇప్పటి వరకు మచ్చుకు ఒకటీ రెండు వదిలారు. కానీ సినిమాలో ఫిలాసఫీతో కూడిన డైలాగ్స్ చాలానే ఉండేలా కనిపిస్తోంది. ఏదేమైనా ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ అవతారంలో ఊతకోత కోయడం ఫ్యాన్స్ కు థియేటర్లలో ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X