Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu: సింహరాశికి ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది..డబ్బు నష్టపోయే సంకేతాలు కూడా ఉన్నాయి..
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Pawan Kalyan ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ సర్‌ప్రైజ్.. భీమ్లా నాయక్ ఒక రోజు ముందుగానే ఓటీటీ రిలీజ్
మలయాళ చిత్ర పరిశ్రమలో సినీ విమర్శకులను మెప్పించడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా ఆధారంగా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నువ్వా నేనా అనే విధంగా పోటీ పడి నటించారు.
ఇక భీమ్లానాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దాదాపు 180 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో హంగామా చేసిన భీమ్లా నాయక్ చిత్రం ఇక ఓటీటీలో హంగామా చేసేందుకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే రోజు RRR చిత్రం కూడా థియేట్రికల్ రిలీజ్ అవుతుండటంతో భీమ్లా నాయక్‌ను ఒక రోజు ముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీస్నీ+హాట్ స్టార్ ఓ ప్రకటన చేసింది.

భీమ్లా నాయక్ సినిమా గురించిన కొత్త వార్తను మీరు విన్నారా? భీమ్లానాయక్ సినిమాను మార్చి 24వ తేదీన డిస్నీ+హాట్ స్టార్, ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. గతంలో ప్రకటించిన 25వ తేదీ కాకుండా 24 గంటల ముందే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని డిస్నీ+హాట్ స్టార్ నిర్వాహకులు తెలిపారు.