twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa Elections: తిప్పి కొడితే 900ల ఓట్లు.. వ్యక్తిగత దూషణలు అవసరమా ?: పవన్‌ కళ్యాణ్‌

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల వాతావరణం ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధ్యక్ష పోటీకి నిలబడినటువంటి ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా ఒకరిని మించి మరొకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక నేడు ఎన్నికల పోలింగ్ మొదలవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఒక్కొక్కరు వారి ఓటు హక్కును వినియోగంచుకునేందుకు ఓటింగ్ సెంటర్ కు వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా రాజకీయాల్లో విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

    3 గంటల తర్వాత 'మా' కౌంటింగ్‌

    3 గంటల తర్వాత 'మా' కౌంటింగ్‌

    ఆదివారం 'మా' ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. చాలామంది సీనియర్ నటీనటులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక ఉదయం 8గంటలకు మొదలైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత 'మా' కౌంటింగ్‌ మొదలు కానుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

    ఇంత హడావుడి అవసరమా

    ఇంత హడావుడి అవసరమా

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఒక్కొక్కరు వారి ఓటు హక్కును వినియోగంచుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా రాజకీయాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ఎన్నికలపై ఇంత హడావుడి అవసరమా అని మాట్లాడారు. రాష్ట్రంలో చాలా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో చాలా వరకు కూడా పంచాయితీ, మున్సిపల్ వంటివి ఏకగ్రీవంగా జరిగినవి కూడా ఉన్నాయి. అలాంటిది మా ఎన్నికల్లో ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదని అన్నారు.

    తిప్పి కొడితే 900ల ఓట్లు..

    తిప్పి కొడితే 900ల ఓట్లు..

    ఇక మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే. మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా ? అని పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడారు. సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదు అని తెలియజేశారు. అలాగే తిప్పి కొడితే 900ల ఓట్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమే లేదని అన్నారు.

    Recommended Video

    MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
    లోకల్.. నాన్ లోకల్

    లోకల్.. నాన్ లోకల్

    మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు మంచు విష్ణు మరొకవైపు ప్రకాష్ రాజ్ ఎవరికి వారు ఇండస్ట్రీ పెద్దల నుంచి మద్దతు అయితే బాగానే అందుకున్నారు. అయితే ఎక్కువగా లోకల్.. నాన్ లోకల్ అనే చుట్టూ ఎన్నికల హడావిడి మొదలైంది. మెగా ఫ్యామిలీ చాలా వరకు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచినట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వచ్చింది ఇప్పటికే నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంచు విష్ణు కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రకాష్ రాజ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఇక విమర్శలు ఎన్నికలపై ఎంతగా ప్రభావం చూపించాయో ఫలితాలను బట్టి అర్థమవుతుంది.

    English summary
    Pawan kalyan shocking comments on maa elections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X