OG: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ల వివరాల్లోకి వెళితే..

ఓజీ ప్రోమోలు, పాటలకు అనూహ్యమైన రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పవన్ కల్యాణ్ కూడా భాగం కానున్నారని తెలిసింది. కొన్ని కీలక ప్రెస్ మీట్లు, మీడియాతో ఇంటరాక్షన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారని సమాచారం.
ఓజీ (OG) మూవీ సినిమా ట్రైలర్‌ను అట్టహాసంగా రిలీజ్ చేసేందుకు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లాన్ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించాలని కార్యాచరణను సిద్దం చేశారు. అంతా సవ్యంగా జరిగితే.. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ట్రైలర్‌ను సెప్టెంబర్ 15వ తేదీన ఆవిష్కరించే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు, ఇండియన్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డీవీవీ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుకొన్న ప్రణాళిక ప్రకారం.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలిసింది.
ఇదిలా ఉంటే.. ఓజీ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ నెల రోజుల ముందుగానే ఓపెన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు 1.25 మిలియన్ డాలర్ల వసూళ్లు అమెరికాలో కలెక్ట్ అయ్యాయి. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు ఉండగానే.. బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











