Payal Rajput చిన్న సినిమాకు చేయూత.. RX 100 హీరోయిన్ చేతుల మీదుగా సౌండ్ టైటిల్
RX 100 సినిమా తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు. తొలి చిత్రంతోనే గ్లామర్ తారగా తన అందచందాలతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొంటున్నారు. కేవలం గ్లామర్ పాత్రలో కాకుండా లేడి ఓరియెంట్ పాత్రల్లో కూడా మెప్పిస్తుంది. తన కెరీర్‌ను ఘనంగా తీర్చిదిద్దుకొంటూనే చిత్ర చిత్రాలకు, నూతన నటీనటులకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగారు. టాలీవుడ్‌లో కొత్త నటీనటులతో రూపొందిస్తున్న చిన్న చిత్రానికి పాయల్ రాజ్‌పుత్ సహాయం అందించింది. సౌండ్ అనే మాట వింటేనే ఓ వైబ్రేషన్.,. అలాంటి టైటిల్‌ను సినిమాకు పెడితే.. ఆ ఫీలే వేరు ఉంటుంది. త్వరలోనే సౌండ్ అనే చిత్రం వెండితెర మీదకు రాబోతున్నది. ఈ సినిమా టైటిల్‌ను పాయల్ రాజ్‌పుత్ ఆవిష్కరించారు. పాయల్ అండగా నిలిచిన ఆ చిత్రం వివరాలు ఏమిటంటే..

శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) బేనర్ ప్రొడక్షన్ నెం1 సినిమా టైటిల్ లోగోను 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ బ్యూటిఫుల్ పాయల్ రాజ్ పుత్ లాంచ్ చేశారు. కొత్త వాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సౌండ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మల్టీ బ్రాండ్ అనేది క్యాప్షన్. పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా టైటిల్ లోగో రివీల్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ " మన జీవితంలో 'సౌండ్' అనేది చాలా కామన్ వర్డ్. అందుకే సినిమాకు ఈ క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మంచి కథతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్ళను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఇటివలే మేము చేసిన ఆడిషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మందిని సెలెక్ట్ చేశాం. త్వరలోనే హీరో -హీరోయిన్ ఎవరనేది రివీల్ చేస్తాం. అలాగే సినిమాకు చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ పనిచేస్తున్నాం."అని తెలిపారు.
నిర్మాత కే. రవీంద్ర మాట్లాడుతూ " మా దర్శకుడు చాలా మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఏ సినిమాకయినా టైటిల్ అనేది చాలా ముఖ్యం. జనాల్లోకి సినిమా కంటే ముందు టైటిల్ వెళ్తుంది. అందుకే అందరికీ రీచ్ అయ్యేలా ఈ టైటిల్ పెట్టాం. మా 'సౌండ్' టైటిల్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. నవంబర్ మూడో వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నాము. అందరి ఆశీస్సులు మా బేనర్ కి సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాం." అన్నారు.


Click it and Unblock the Notifications











