టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ వెటరన్ ప్లే బ్యాక్ సింగర్ కన్నుమూత!
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ సెకండ్ వేవ్ భారతదేశంలో మొదలయ్యాక మరీ దారుణంగా రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవటమే కాక వేల సంఖ్యలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక అనేకమంది కన్నుమూసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు షూటింగులు అన్నీ నిలిపివేశారు. ఇక సినీ పరిశ్రమలో కూడా ఎలాంటి ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడంలేదు. దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సెకండ్ వేవ్ మొదలయ్యాక దర్శకత్వ విభాగంలో పనిచేసిన కొందరు యువ దర్శకులు, కొంత మంది నటులు అలాగే కొంతమంది జర్నలిస్టులు కన్నుమూశారు.
ఇప్పుడు తాజాగా తమిళ, తెలుగు సినిమాల్లో ఎంతో మంది ప్రముఖులకు డబ్బింగ్ చెప్పి, ఎన్నో పాటలు పాడిన ఏ వి ఎన్ మూర్తి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన ఏ వి ఎన్ మూర్తి తెలుగు, తమిళ సినిమాల్లో ప్లే బాక్ సింగర్ గా అనేక పాటలు పాడారు. ఇక ఆయన కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆయన సూర్య, రాజశేఖర్ మొదలగు హీరోలకు డబ్బింగ్ చెబుతూ ఉంటారు.

ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన ఏ వి ఎన్ మూర్తి మరణించారన్న విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. వయోభారం కారణంగా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆయన కొద్ది రోజులుగా బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారని అంటున్నారు. ఇక శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పడమే గాక మరి కొన్ని సినిమాలలో కూడా నటించారు. అయితే అవన్నీ తమిళ సినిమాలే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











