Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అన్ని ఎమోషన్స్ ఒకేసారి... అభిమాని పనికి నోట మాటరాని హీరోయిన్
వరుణ్ తేజ్ మొదటి చిత్రం 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ పూజా హెగ్డే. అయితే ఈ చిత్రం తరువాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ అపజయాలు పలకరించడంతో మళ్లీ తెలుగులోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం పూజా హెగ్డేను ఇష్టపడటం మానలేదు. హరీష్ శంకర్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన డీజే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది.

వరుస ఆఫర్లతో బిజీ..
అనంతరం వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడుతోంది. అల్లు అర్జున్ సరసన 'డీజే, అల వైకుంఠపురములో, ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత' మహేష్ బాబు సరసన ‘మహర్షి'వరుణ్‌తో ‘వాల్మీకి' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
|
తాజాగా అల వైకుంఠపురములో..
ప్రస్తుతం పూజా హెగ్డే అల వైకుంఠపురములో విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే మీడియాతో ఇంటర్ యాక్ట్ అవుతూ చిత్ర విశేషాలను పంచుకుంది. అయితే ఇంత బిజీగా ఉన్నా పూజాకు ఓ అభిమాని నోట మాట రాకుండా చేశాడు. అతను చేసిన పనికి పూజా ఏడిచినంత పని చేసింది. ఇంతకీ అతనేం చేశాడన్నది ఓసారి చూద్దాం.

పచ్చబొట్టు పొడిపించుకున్న ఫ్యాన్
పూజా హెగ్డే పేరును తన చేతిపై పచ్చబొట్టును పొడిపించుకున్న ఆ అభిమాని ఆమెను ట్యాగ్ చేశాడు. అది చూసిన పూజా హెగ్డే ఆశ్చర్యానికి గురైంది. అంతేకాకుండా.. నువ్వు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను అంటూ ఓ హగ్ ఎమోజీని, ఏడుస్తున్న ఎమోజీని, లవ్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఒకే సారి చూపించింది బుట్టబొమ్మ.

ప్రభాస్, అఖిల్ సినిమాలతో బిజీగా..
ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలను చేస్తున్నానని తెలిపింది. ప్రభాస్‌తో చేస్తున్న సినిమా దాదాపు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, మరో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోన్నట్లు తెలిపింది. అఖిల్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నానని, అతనితో వర్క్ చేయడం బాగుందని తెలిపింది.