twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3Dలో ప్రభాస్ ఆది పురుష్.. సినిమా బడ్జెట్, రిలీజ్.. అసలు కథ ఏమిటంటే?

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం తన స్థాయిని బలాన్ని చాలా ఈజీగా బాలీవుడ్ ముందు నిరూపించుకున్నాడు. ప్రభాస్ తో ఎలాంటి సినిమా అయినా తీయవచ్చని ఆ ఒక్క సినిమా నిరూపించింది. అందుకే ఓం రావత్ ప్రభాస్ ని ఆదిపురుషుడిగా చూపించబోతున్నాడు. నెవర్ బిఫోర్ అనేలా సినిమా రూపొందనుంది. ఇక సినిమా బడ్జెట్, రిలీజ్, సినిమా అసలు కథ ఏమిటి అనే విషయాల్లోకి వెళితే..

    డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్

    డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్

    ఇటీవల తానాజీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు ఓం రావత్ నెక్స్ట్ అంతకంటే హై బడ్జెట్ లో తన డ్రీమ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు గత కొన్ని వారాల నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో హిస్టారికల్ ప్రాజెక్టును సెట్ చేసుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక సినిమా రామాయణం అని పోస్టర్ చూస్తేనే అర్ధమవుతోంది.

    రామాయణం ఆధారంగా..

    రామాయణం ఆధారంగా..


    పోస్టర్‌లో రాముడు, హనుమంతుడు, వానర సేన వంటి క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఇది రామాయణం ఆధారంగా రూపొందించినట్లు మేకర్స్ ప్రకటించకపోయినప్పటికీ, పోస్టర్‌లో స్పష్టమైన పురాణ పాత్రలు కనిపించడం చూస్తుంటే కథ అదేనని అర్థమవుతోంది. గతంలో ఓం రావత్ చాలా సార్లు రామాయణం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు.

    3Dలో ఆది పురుష్

    3Dలో ఆది పురుష్

    ఇక రాముడి పాత్రకు ప్రభాస్ కరెక్ట్ గా సరిపోతాడు. కానీ మిగతా పాత్రలు కూడా చాలా బలంగా ఉండాలి. హనుమంతుడు అలాగే రావణాసురుడు, లక్ష్మణుడు వంటి బలమైన పాత్రల్లో ఎలాంటి వారు కనిపిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా 3Dలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

     500కోట్ల భారీ బడ్జెట్ తో

    500కోట్ల భారీ బడ్జెట్ తో

    దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమాను నిర్మించనున్నారట. ఇక సినిమాకు హాలీవుడ్ VFX టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.

    Recommended Video

    Maddy Ane Madhav Muchattaina Moovannela Janda Mana India Song
    రిలీజ్ ఎప్పుడంటే..

    రిలీజ్ ఎప్పుడంటే..


    ఇక సినిమాను 2021లో స్టార్ట్ చేసి 2022లో ప్రేక్షకుల ముందుకి తేవాలని అనుకుంటున్నారు. కానీ సినిమాను ఒక ఏడాదిలో ఫినిష్ చేయాలి అంటే అంత సులువైన విషయం కాదని టాక్ వస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం పక్కా ప్లాన్ తో సినిమాను చాలా తొందరగా రిలీజ్ చేయాలని టార్గెట్ సెట్ చెసుకున్నట్లు టాక్. ప్రభాస్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు కథను చెప్పిన విధానం, క్యారెక్టర్ ని అతను తన స్టైల్ లో డిజైన్ చేసుకున్న విధానం చాలా బావుందని తప్పకుండా ప్రాజెక్టుకు అతను న్యాయం చేస్తాడని వివరణ ఇచ్చారు.

    English summary
    Young Rebel star Prabhas and Om Raut joining hands for Pan India Movie for T Series. Reports sugges that The project details will be announced on August 18th morning 7 o'clock on Instagram live. This news excited prabhas and fans too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X