ఒకేసారి 15 భాషల్లో ప్రభాస్ సినిమా.. న్యూ రికార్డు క్రియేట్ అయినట్లే.. ఎన్ని స్క్రీన్స్ అంటే..
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా
పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతాయని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే రానున్న రోజుల్లో మాత్రం రెబల్ స్టార్ సినిమాలు ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోకి కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకు దక్కని సినిమాలు ప్రభాస్ చేజిక్కించుకున్నాడు. అతని రెమ్యునరేషన్ స్థాయి కూడా అందరి కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఇక మార్కెట్ కు తగ్గట్టుగా వివిధ భాషల్లో ప్రభాస్ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారు. రాబోయే ఒక సినిమా అయితే ఏకంగా 15 భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అందరి ఫోకస్ ప్రభాస్ మూవీ పైనే..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం అంతకుమించి అనేలా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. సాహో సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సినిమాల కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అందరి చూపు అయితే రాధేశ్యామ్ సినిమాపైనే ఉంది. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఆ తరువాత ఆదిపురుష్
ఇక ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ లో తెరపైకి రాబోతున్న సినిమాల్లో సలార్ తో పాటు ఆదిపురుష్ కూడా టాప్ లిస్ట్ లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ దాదాపు ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ ను ప్రభాస్ జెట్ స్పీడ్ లోనే పూర్తి చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత ప్రభాస్ నుంచి పూర్తిగా మైతలాజికల్ ఫిలిమ్ ఆది పురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు.

గ్రాఫిక్స్ కోసమే..
మొట్టమొదటిసారి ఇండియాలో ఒక చారిత్రాత్మక చిత్రాన్ని అత్యధిక భారీ టెక్నాలజీతో త్రీడీ రూపంలో తెరపైకి తీసుకు రాబోతున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయితే దాదాపు ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. గ్రాఫిక్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

15 భాషల్లో..
దాదాపు మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం భారత దేశ భాషల్లోనే కాకుండా ప్రపంచంలోని ఇతర భాషల్లోకి కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మొత్తంగా 15 భాషల్లో అది పురుష్ మూవీని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్లాన్ ను కూడా రెడీ చేసినట్లుగా టాక్ అయితే వస్తుంది.
Recommended Video

అత్యధిక స్క్రీన్స్ లలో..
ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కానన్ని థియేటర్స్ లలో ఆది పురుష్ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేలకు పైగా స్క్రీన్స్ లలో సినిమాను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అలా విడుదల చేస్తే సినిమా మొదటి రోజు ఈజీగా వంద కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











