Project-K: గురువు అమితాబ్‌పై ప్రభాస్. క్లాప్... గొప్ప గౌరవం అంటూ నాగ్ అశ్విన్ సినిమా టైటిల్ రివీల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగాయి. గురు పూర్ణిమ పండుగను పురస్కరించుకొని ముహుర్తపు షాట్ వేడుకను జరిపారు. ఈ సందర్బంగా ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ప్రభాస్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. తొలి షెడ్యూల్ దాదాపు 10 రోజులపాటు హైదరాబాద్‌లోని స్టూడియోలో జరుగనున్నది.
ముహుర్తపు షాట్ గురించి ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో తెలియజేస్తూ.. గురుపూర్ణిమ రోజున ఇండియన్ సినిమాకు గురువైన ప్రముఖుడిపై క్లాప్ కొట్టడం గర్వంగా ఉంది. ప్రాజెక్ట్ కే ఆరంభమైంది అంటూ ప్రభాస్ తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి తాత్కాలిక టైటిల్‌గా Project-K అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్‌తో సలార్, ఓం రావత్‌తో ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డేతో నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది.


Click it and Unblock the Notifications











