Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్‌డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదిప్పుడు.. జాతీయ స్థాయికి ఎదిగి ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టికూడా ప్రభాస్‌పై ఉంటుంది. బాహుబలి సినిమాతో ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోయాడు. సాహో సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. కేవలం ప్రభాస్ తన స్టామినాతోనే సాహో చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద పోరాడి నిలిచేలా చేశాడు.

ప్రభాస్ భుజాలపై సాహో..
కేవలం ప్రభాస్ స్టార్‌డమ్ సాహోను బాక్సాఫీస్ బరిలో విజేతగా నిలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం ఘన విజయం సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 350కోట్లను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆశించినంత విజయాన్ని సాధించకపోయినా.. ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

ప్రభాస్ తదుపరి చిత్రం..
జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇటలీ, హైద్రాబాద్‌లో జరిగిన ఈ రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.. మరో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
|
తాజాగా పూజా..
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సక్సెస్ సాధించిన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ.. ప్రభాస్ మూవీ విశేషాలను కూడా పంచుకుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని తెలిపింది.
|
వచ్చే వారంలో..
జనవరి మూడో వారంలో మూడో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, బహుషా 20వ తేదీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ నేడు ప్రకటిస్తామని యూనిట్ ప్రకటించింది. అయితే ఆ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో తెలీక ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి ఫ్రస్ట్రేషన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. యూవీ క్రియేషన్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి.