For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Salaar: సలార్‌లో ప్రభాస్ ఇంట్రో సీన్ లీక్.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఇలా!

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో సందడి చేశాడు. అయితే, రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' చిత్రంతో అతడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుని తన అభిమానులకు మజాను పంచుతూనే ఉన్నాడు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో మరీ ఇంత దారుణంగానా!

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండడమే. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకున్నారు.

  ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో ఎన్నో హైలైట్లు ఉండబోతున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, దీన్ని ఓ భారీ లోయలో ఉన్న ఓ గుహలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాలోనూ చూపించని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం విదేశాలకు చెందిన టెక్నీషియన్లను తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను మరికొద్ది రోజుల్లోనే మొదలు పెడతారని సమాచారం.

  బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత

  Prabhas Introduction Scene Highlight in Salaar

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు, కేజీఎఫ్ చాప్టర్ 2ను మించిపోయేలా హీరో ఎలివేషన్ సీన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభాస్ ఎన్నో సాహసాలు కూడా చేయబోతున్నాడు. మరీ ముఖ్యంగా ఇంట్రో సీన్ కోసం ఈ పాన్ ఇండియా హీరో కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పుడే ఈ సన్నివేశంపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమే 'సలార్'. ఈ మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో వార్తలు వస్తున్నాయి.

  English summary
  Prabhas Doing Salaar Movie under Prashanth Neel Direction. Prabhas Introduction Scene will br Major Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X