Just In
- 7 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 7 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 8 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 9 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత కోసం ప్రభాస్ త్యాగం చేస్తాడా.? మంతనాలు జరుపుతున్న బడా ప్రొడ్యూసర్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది అక్కినేని వారి కోడలు సమంత. 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె.. అనతి కాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. కొన్నేళ్లుగా వరుస విజయాలు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. 'ఓ బేబీ' తర్వాత కొంచెం స్లో అయింది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

ఆమె చేతిలో ఉన్నది ఇదొక్కటే
సమంత ‘96' తెలుగు రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. దీన్ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు

కొంచెం కూడా మారలేదు
తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96' సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి చాలా మంది సన్నాహాలు చేశారు. అయితే, ఈ హక్కులు మాత్రం దిల్ రాజుకే దక్కాయి. ఒరిజినల్ డైరెక్టరే దీన్ని కూడా తెరకెక్కిస్తుండడంతో కథలో మార్పులు చేయలేదట. కానీ, ఇక్కడి నేటివిటీతో రూపొందించారని టాక్.

సినిమా టైటిల్ ఫిక్స్
ఈ సినిమాకు కూడా ఒరిజినల్ టైటిల్ పెడతారని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఇందులో 96కు బదులు 2000 నాటి ప్రేమకథను చూపించారట. దీంతో ఈ మూవీ టైటిల్‌ను మార్చాలని భావించిందట చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే దీనికి ‘జానూ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇందులో సామ్ పాత్ర పేరు జానకి కావడమే.

ప్రభాస్ సినిమా టైటిల్ కూడా అదే
ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. దీనికి ‘జాన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా అంతా యూరప్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ఇది కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనుందని సమాచారం.

సమంత కోసం ప్రభాస్ త్యాగం చేస్తాడా.?
శర్వానంద్ - సమంత కాంబోలో వస్తున్న సినిమా టైటిల్, ప్రభాస్ మూవీ టైటిల్ ఒకేలా ఉండడంతో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ప్రభాస్ మూవీ నిర్మాతలతో మూవీ టైటిల్ మార్చే విధంగా చర్చలు జరుపుతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ దీనికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.