For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush Release Date: ఆరోజునే ఎందుకు ఫిక్స్ చేశారంటే.. అదే జరిగితే రికార్డులు ఖాయం

  |

  పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడు సినిమాల షూటింగ్‌లను చేస్తున్నాడు. ఒక్కో సినిమాను ఒక్కో జోనర్‌లో తీయడమే కాదు.. అన్నింటినీ పాన్ ఇండియా రేంజ్‌తో చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించే చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్' ఒకటి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అప్పటి నుంచి పంథాను మార్చేశాడు

  అప్పటి నుంచి పంథాను మార్చేశాడు

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ‘సాహో' అనే సినిమాను చేశాడు. ఇది దక్షిణాదిలో అంతగా ఆడకున్నా.. ఉత్తరాదిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

  సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ప్రభాస్. ‘బాహుబలి' రాజులా.. ‘సాహో'లో యాక్షన్ హీరోలా కనిపించిన అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో ‘రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారి రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

   పాన్ ఇండియా రేంజ్‌లో.. ఎవరెలాగ?

  పాన్ ఇండియా రేంజ్‌లో.. ఎవరెలాగ?

  ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే ‘ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

   చివరి దశకు షూటింగ్.. ప్రభాస్ బిజీ

  చివరి దశకు షూటింగ్.. ప్రభాస్ బిజీ

  ‘ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నాడు. ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ వేగంగా జరుగుతుందని తెలుస్తోంది.

  ‘ఆదిపురుష్' విడుదల తేదీ ఫిక్స్

  ‘ఆదిపురుష్' విడుదల తేదీ ఫిక్స్

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఐదో భాషల్లో ఇది తెరకెక్కుతోంది. ఇక, ఈ సినిమా విడుదలపై చాలా రోజులుగా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  Bigg Boss: ఐదో సీజన్‌లో విజేత ‘అతడే'నా.. అలా బయటకు వచ్చిన మేటర్.. బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

  Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
  ఆరోజునే ఎందుకు రిలీజ్ చేస్తారంటే

  ఆరోజునే ఎందుకు రిలీజ్ చేస్తారంటే

  ‘ఆదిపురుష్' సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. దీనికి కారణం లాంగ్ వీకెండ్ ఉండడమేనని తెలుస్తోంది. 11వ తేదీ శుక్రవారం కాగా.. శనివారం సెకెండ్ సాటర్‌డే. తర్వాత ఆదివారం ఈ మూడు రోజుల తర్వాత సోమవారం సాధారణ రోజు. ఇక, 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. ఇలా ఐదు రోజులు ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించుకోబోతుంది.

  English summary
  Young Rebel Star Prabhas Now Doing Adipurush Movie Under Om Raut Direction. This Movie will be Release on August 11, 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X