Prabhas ఫ్యాన్స్‌కు శుభవార్త.. రాధేశ్యామ్ రిలీజ్ గురించి డైరెక్టర్ ట్వీట్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త రాబోతున్నది. 2018లో ప్రారంభమైన ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు పూర్తి చేసుకొన్నది. కరోనావైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నది. ఈ సినిమా షూటింగును రెండో లాక్‌డౌన్ తర్వాత మొదలుపెట్టి బుధవారం పూర్తి చేసుకొన్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది.
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేస్తూ... రాధే శ్యామ్ సినిమా చివరి షెడ్యూల్ ముగిసింది. డార్లింగ్ ఫ్యాన్స్‌ను నా ప్రేమను పంచుతూ ఈ విషయాన్ని షేర్ చేసుకొంటున్నాను. ఈ కరోనా పరిస్థితులు మా అంచనాలను తలకిందులు చేశాయి. త్వరలోనే మిమల్ని ఆనందానికి గురిచేసే వార్తను అందించబోతున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చివరి రోజుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధాకృష్ణ కుమార్, ప్రభాస్, ఇతర యూనిట్ సభ్యుల ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి.
రాధేశ్యామ్ చిత్రం 2022 సంక్రాంతి బరిలో దూకేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భీమ్లానాయక్, సర్కారు వారీ పాట లాంటి మాస్ చిత్రాల మధ్య రాధేశ్యామ్ లాంటి క్లాస్ సినిమాను రిలీజ్ చేసి అభిమానులకు సంక్రాంతిని పెద్ద పండుగలా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అలాగే ప్రభాస్ అభిమానులకు ఆగస్టు నెల పండుగ వాతావరణం తీసుకు రానున్నది. రాధేశ్యామ్, సలార్ ప్రాజెక్ట్ కే గురించిన విషయాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











