For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Salaar కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ: కేజీఎఫ్ వచ్చిన అన్ని నెలలకు ప్రభాస్ మూవీ

  |

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మూవీ కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన 'సాహో'కు రెండేళ్లు తీసుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఎంతగానో బాధ పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఏడాదికి ఒక సినిమానైనా ఇస్తానంటూ అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశాడు. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నా.. కరోనా కారణంగా అది చాలా ఆలస్యం అయింది. అయినప్పటికీ అతడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగానే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్' కాగా.. మరొకటి నాగ్ అశ్విన్ తీసే 'ప్రాజెక్ట్ K'. ఇక మూడో సినిమానే కేజీఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ప్రశాంత్ నీల్ రూపొందించే సలార్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  Prabhas Salaar Likely to Release on July 2022

  రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవడానికి ముందే 'సలార్' మూవీని ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఇప్పటికే రెండు సార్లు కోవిడ్ లాక్‌డౌన్స్ రావడంతో ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంటే అదే సంస్థ నిర్మిస్తోన్న 'సలార్' మూవీ ఆరోజు విడుదల అవడం లేదని పరోక్షంగా వెల్లడించారు.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  'సలార్' మూవీ విడుదల అవ్వాల్సిన రోజే 'కేజీఎఫ్ 2'ను తీసుకు వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు నిరాశగా ఉన్నారు. దీనిపై వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో 'సలార్' మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2022 జూలైలో విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటనను అతి త్వరలోనే ఇవ్వనున్నారని ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ఇధి 1970 నాటి కథతో సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది. ఇక, ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు పోషిస్తోన్న పాత్రకు సంబంధించిన లుక్ తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Young Rebel Star Prabhas Upcoming Movie is Salaar under Prashanth Neel Direction. Latest Buzz is That.. This Movie Likely to Release on July 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X