Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్‌డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. మొత్తానికి ఇలా చెప్పేశారు
'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత 'సాహో' రూపంలో ఊహించని డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. అభిమానుల్లో నెలకొన్న ఆ వెలితిని ఎలాగైనా చెరిపేయాలనే స్ట్రాంగ్ డిసీజన్ తీసుకొని రాధాకృష్ణ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా స్టార్ చేశారు ఈ యంగ్ రెబర్ స్టార్.
ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రానికి ''జాన్'' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. 1960 కాలం నాటి కథతో యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇందుకోసం దాదాపు 180 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. ఎప్పటినుంచో ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ రేపు (జనవరి 17) ఇవ్వబోతున్నామని పేర్కొంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ రోజు కనుమ.. నేటితో సంక్రాంతి ముగుస్తుంది. అయితే అసలు సంక్రాంతి రేపే అంటూ ఈ ప్రకటన జారీ చేయడం విశేషం.
యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హస్త సాముద్రికం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని ఫిలిం నగర్ టాక్. మరి రేపు ప్రభాస్ అండ్ టీమ్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వనున్నారో చూద్దాం!.