Don't Miss!
- News
ఎన్నికల యుద్ధానికి పవన్ కళ్యాణ్ వారాహి సిద్ధం; రేపు కొండగట్టుకు; రూట్ మ్యాప్ ఇలా!!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Salaar: ఫ్యాన్స్ కోసం ప్రభాస్ కీలక నిర్ణయం.. రిస్క్ అయినా తప్పట్లేదట
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించి.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తోన్న అతడు.. అన్ని భాషల్లోనూ మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు అతడు ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. వీటిలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. అలాగే, మిగిలిన నటీనటుల పైనా ఎన్నో భారీ బడ్జెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

'సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎంత వరకూ పూర్తైంది అనే దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందో అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం తన పార్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం అతడు దర్శకుడికి ఫిబ్రవరి చివరి వరకూ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటిలోగా తన భాగాన్ని కంప్లీట్ చేసుకుని వేరే సినిమాల షూటింగ్‌లో పాల్గొనాలని ప్రభాస్ భావిస్తున్నాడట. రిస్క్ అయినా వేగంగా సినిమాలు చేయడం కోసమే అతడిలా డిసైడ్ అయ్యాడని టాక్.
శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!
'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు.