Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మెగాస్టార్ కు తక్కువ కాకుండా మంచు విష్ణు నిర్ణయం.. రంగంలోకి నెంబర్ వన్ మాస్టర్
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు మరొక కామెడీ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హీరోగా గత కొంతకాలంగా విభిన్నమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం లేదు. చివరగా మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మోసగాళ్లు సినిమా మంచు విష్ణు తన సొంత బ్యానర్లోనే నిర్మించాడు. ఆ సినిమాతో కొన్ని నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక ప్రస్తుతం మంచు విష్ణు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ఒక విభిన్నమైన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో మంచు విష్ణు చేసిన కామెడీ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు గాలి నాగేశ్వరరావు అనే ఒక కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆమధ్య కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇండస్ట్రీలో ప్రముఖ సెలబ్రిటీల పై తరచుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి అలాగే మీమ్స్ ట్రోల్స్ పై సెటైర్ లను సినిమాలో హైలెట్ చేసి చూపించబోతున్నాట్లు గా తెలుస్తోంది. ఒక విధంగా మంచు విష్ణు పవర్ఫుల్ సెటైర్ వేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే సినిమా కాన్సెప్ట్ విషయంలో ఇంత వరకు చిత్ర యూనిట్ సభ్యులు దగ్గర నుంచి అలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఈ సినిమాతో మాత్రం మంచు విష్ణు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. కోన వెంకట్ ఈ సినిమాకు కథ మాటలు అందిస్తుండగా ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరావు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక మంచు విష్ణుకు బాగా క్లోజ్ గా ఉండే ఒక సహాయక దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మంచు విష్ణు ఈ సినిమాకి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా నెంబర్ వన్ మాస్టర్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవాను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మెగాస్టార్ కు అలాగే సల్మాన్ ఖాన్ కు స్టెప్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు మంచు విష్ణు కొత్త సినిమాకి కూడా డ్యాన్స్ మూమెంట్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా పదేళ్ల క్రితం ప్రభుదేవాతో కలిసి వర్క్ చేసిన మంచు విష్ణు మళ్ళీ ఇన్నాళ్లకు వర్క్ చేస్తున్నాడు. మరి ఆ పాట ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. అలాగే మంచు విష్ణు మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు.