ప్రభుత్వ జూనియర్ కళాశాల.. తెలుగు తెరపై మరో కాలేజీ టీనేజ్ స్టోరి.. ప్రేమికుల రోజున..

ప్రస్తుత పరిస్థితులు, మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలపై ప్రేక్షకుల అభిరుచి మారుతున్నది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమాలను రూపొందించడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా వస్తున్న చిత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల. యదార్థ సంఘటనను కథాంశంగా తీసుకొని డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం ఆసక్తికరంగా మలిచారు.

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.

Prabhutva Junior Kalashala first look on February 14th.

ఇంటర్మీడియట్ స్థాయిలో టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు

నటీనటులు: ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
కథ, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
సంగీతం: శరవణ వాసుదేవన్
డీవోపి: నిఖిల్ సురేంద్రన్
కో డైరెక్టర్: వంశి ఉదయగిరి
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X