twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prakash Raj : ఉదయం చెన్నైలో-కాసేపటికి హైదరాబాద్ లో.. ఆ విందుకు పోటీగా మరో విందు?

    |

    ఈ మధ్యకాలంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.. మరీ ముఖ్యంగా ఆయన తాను ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడుతుందని ప్రకటించారో అప్పటి నుంచి ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో కాక అనేక అంశాల మీద రక రకాలుగా స్పందిస్తున్నారు.. అంతేకాక ఎక్కువగా ఆయన సోషల్ మీడియాలో తెలుగులో స్పందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..ఈరోజు ఆయన చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి.

    చెన్నై-హైదరాబాద్

    చెన్నై-హైదరాబాద్

    ఈరోజు చెన్నైలో ఉదయం జెండావందనం చేసిన ఆయన మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తన ప్యానల్ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్న వారితో కలిసి మళ్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. జెండా కూడా ఎగుర వేశారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆసక్తికరంగా మారాయి. ముందుగా ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో జెండా వందనం చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు..

    హైదరాబాద్ విచ్చేసి

    హైదరాబాద్ విచ్చేసి


    అయితే ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే హైదరాబాద్ చేరిన ఆయన హైదరాబాద్ లో తన ప్యానల్ సభ్యులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. నిన్న జెండా ఎగరవేస్తామని ట్వీట్ చేసిన ఆయన ఈరోజు జాతీయ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత వారందరితో భోజనాలు కూడా చేశారు. ఇక ఆయన తెలుగులో ఒక సుదీర్ఘ సందేశాన్ని కూడా షేర్ చేశారు. అంతా తెలుగులోనే ఉన్న ఈ సందేశం ఆసక్తికరంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. కవితా ధోరణిలో ఈ సందేశం ఉంది.

    గతాన్ని స్మరించుకుంటూ

    గతాన్ని స్మరించుకుంటూ

    ''మట్టిని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశాన్ని ప్రేమించే వాడే మనుషులను ప్రేమిస్తాడు, మన వాళ్ళ కోసం ఆలోచించడం కన్నా దేశభక్తి మరొకటి లేదు అన్న నినాదంతో స్వేచ్ఛ స్వచ్ఛత సమసమాజ న్యాయాన్ని కోరుకుంటూ మా శ్రేయస్సు కోసం మనకోసం మనం మా కోసం మనం టూ కదిలివచ్చి భారత పౌరుడిగా గర్విస్తూ గతాన్ని స్మరించుకుంటూ వర్తమానంలో నుంచి భవిష్యత్తులోకి ఆచరణాత్మక దిశగా అడుగులు వేస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి జన గణ మన జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలు జరుపుకున్నాము అంటూ ఆయన తెలుగులో చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    ఊరట

    ఊరట

    ఇక అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయంలో హేమకు షోకాజ్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో నటి హేమ మీద కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ భావించగా క్రమశిక్షణ సంఘం నుంచి హేమకు పెద్దగా ఇబ్బంది ఏమి ఎదురు కాలేదు అని తెలుస్తోంది ఇదే మొదటి తప్పిదం గా భావిస్తూ హేమ హెచ్చరిస్తూ ఆమె మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండడానికి క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    హేమ షోకాజ్

    హేమ షోకాజ్

    హేమ షోకాజ్ నోటీసుకు స్పందించిన తీరు ఆమె ఇచ్చే వివరణ పట్ల క్రమశిక్షణ సంఘం సంతృప్తికరంగా భావించిందని మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని మరోసారి ఇదే విషయం కనుక రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదలి వేసినట్లు సమాచారం. ఎన్నికల తేదీ కూడా ప్రకటించకుండానే ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.. ఎన్నికల తేదీ కూడా ప్రకటిస్తే ముందు ఇంకెన్ని విషయాలు జరుగుతాయి అనేది చూడాల్సి ఉంది. ఇక మా అధ్యక్ష్యుడు నరేష్ విందుకు పోటీగానే ఈ విందు ఏర్పాటు చేశారని అంటున్నారు.


    English summary
    Prakash Raj Celebrated Independence Day Celebrations‌ with his Maa Panel‌.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X