Don't Miss!
- News
Jayalalithaa: జయలలిత కేసులో మళ్లీ ?, టైమ్ కావాలి సార్, ట్విస్ట్ లు, సీబీసీఐడీ ఎంట్రీ !
- Travel
సందర్శకులు మెచ్చే పర్యాటక మణిహారం.. కాకినాడ తీరం!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Sports
ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నా: పృథ్వీ షా
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఫుల్ బిజీగా మారిన ప్రకాష్ రాజ్.. అన్ని చోట్లా అతనే
ఇండియన స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలు వేయాలన్నా ప్రకాష్ రాజ్ ముందుంటాడు. అన్ని భాషల్లో అన్ని రకాల పాత్రలు చేసిన ప్రకాష్ రాజు ప్రస్తుతం రాజకీయంగానూ బిజీగానే ఉన్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటాడు. సమాజంలో జరిగే అన్యాయాలపై చురకలంటించినట్టుగా ప్రశ్నలు సంధిస్తుంటాడు. అయితే కొన్ని సార్లు ప్రకాష్ రాజ్‌పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.
లాక్డౌన్‌లో ఫాంహౌస్‌లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ప్రకాష్ రాజ్ చేతనైన సాయం చేసుకుంటూ వచ్చాడు. మళ్లీ ఇప్పుడు తన రొటీన్ లైఫ్‌లో బిజీ అవుతున్నాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రకాష్ రాజ్ బిజీగానే ఉంటున్నాడు. అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ మొన్నటి వరకు క్లాప్ సినిమాతో గడిపేశాడు. తాజాగా మళ్లీ విశాల్ సినిమా సెట్‌లోకి వచ్చేశాడు. ఇలా ప్రతీ చోటా ప్రకాష్ రాజ్ సందడే కనిపిస్తోంది.

విశాల్ ఆర్య కలిసి నటిస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ నిన్ననే రిలీజ్ చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ ట్వీట్ చేస్తూ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశాడు. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకాష్ రాజ్‌కు ఘన స్వాగతం పలికింది. వాడు వీడు సినిమా తరువాత ఆర్య విశాల్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.