Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Prakash Raj ప్యానెల్ మామూలుగా లేదుగా.. అనసూయ, సుడిగాలి సుధీర్ సహా ఎవరెవరున్నారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ సారి మాత్రం రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీలో ఉండగా నిన్న తాజాగా నటి హేమ కూడా మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించింది. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగగా ఆయన అదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేసే వారి లిస్టు బయటకు వచ్చింది.
''సిని'మా' బిడ్డలం-మన కోసం మనం-'మా' కోసం మనం'' అనే కాప్షన్ తో ఈ లిస్టు రిలీజ్ చేశారు. త్వరలో జరగబోయే మా ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని, 'మా' శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. 'మా' టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నామని చెబుతూ లిస్టు ప్రకటించారు.

ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ సిని 'మా' బిడ్డలులో మొత్తం మీద 27 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్‌రావు లాంటి వారు ఉన్నారు. మరి ఈ మా ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.