twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'MAA'కి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగు సినిమాలను వదలను..దూరం చేస్తారేమో చూద్దామంటూ ప్రకటన!

    |

    హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష్య పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన నాగబాబు నిన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన తర్వాత ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    'మా' సభ్యత్వానికి రాజీనామా

    'మా' సభ్యత్వానికి రాజీనామా

    'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో పరాజయం పాలైన ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. 'మా' ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారని, నేను తెలుగు వాడిని కాదు అని నన్ను ఓడించారని ఆయన అన్నారు. అలాంటప్పుడు నేను 'మా' సభ్యుడుగా ఉండటం లో అర్థం లేదని ఆయన అన్నారు. 'మా' సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని పేర్కొన్న ఆయన తెలుగులో నటించడం కొనసాగిస్తానని అన్నారు.

    21 ఏళ్ల అనుబంధం

    21 ఏళ్ల అనుబంధం

    'మా'తో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉందన్న ఆయన అతిథిగా వచ్చాను అతిథిగానే ఉంటానని ఆయన అన్నారు. నన్ను నాన్‌ లోకల్ అన్న కోట, రవిబాబు మాటల్ని గౌరవిస్తానాని ఈ లోకల్‌, నాన్‌ లోకల్ అజెండాల మధ్య ఉండలేనని అన్నారు. మా సభ్యత్వం లేకుంటే సినిమాలు చేయనివ్వరా?, చేయనిస్తారు కదా అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

    సినిమాలు లేవంటే ఆలోచిద్దాం

    సినిమాలు లేవంటే ఆలోచిద్దాం

    నాకు ఓటు వేసిన అందరినీ గౌరవిస్తాననని, ఇలాంటి అజెండా వున్న అసోసియేషన్ తో పని చేయడం ఇష్టం లేదు.. 'మా'కి రాజీనామా చేశాను తప్ప.. తెలుగు సినిమాని వదిలి పోవటం లేదు, ఇలాంటి వాతావరణంలో నేను ఉండలేనని ప్రకాష్‌ రాజ్ అన్నారు. నా తెలుగు ప్రేక్షకుల నుంచి నా తెలుగు సినిమా నిర్మాతల నుంచి నన్ను వేరు చేయలేరన్న ఆయన నాకు ఒక ఆత్మ గౌరవం ఉంది.. అందుకే రాజీనామా చేశానని నేను ఓటమి పై విశ్లేషించుకుంటానని ప్రకాష్‌ రాజ్‌ పేర్కొన్నారు. జాతీయ వాదం గెలిచింది బండి సంజయ్ లాంటి వారు సంతోషపడ్డారని ఆయన అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనే దానికి నేను వ్యతిరేకం అన్న ఆయన మా సభ్యత్వం లేని వారికి సినిమాలు లేవు అంటే ఆలోచిద్దామని అన్నారు. రాజకీయాలు వేరు, సినిమా అసోసియేషన్ వేరు ఈ ఎన్నికల్లో రాజకీయ సపోర్ట్ అవసరం లేదు అనుకున్నానని అన్నారు.

    ఓటమి జీర్ణించుకున్నా.. అందుకే

    ఓటమి జీర్ణించుకున్నా.. అందుకే

    తనను నాన్-లోకల్ అన్నారని, అతిథిగా ఉంటేనే గౌరవిస్తామన్నారని ఆయన అన్నారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు.. అది నా తప్పు కాదు.. వారి తప్పు కాదన్న ప్రకాష్‌రాజ్ తనకు ఆత్మాభిమానం ఉందని అందుకే 'మా'తో 21 ఏళ్ల అనుబంధానికి తెరదించుతున్నానని పేర్కొన్నారు. గెలిచిన మంచు విష్ణు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రకాష్ రాజ్ కోరారు.
    చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారని ఆయన అన్నారు. మా కుటుంబంలో అందరూ ఒక్కటే అనే పదం అబద్ధం అని ఆయన అన్నారు. ఓటమి జీర్ణించుకున్నా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇక ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ కంట కన్నీటి జీర కనిపించింది.

    Recommended Video

    Anubhavainchu Raja Song Launched By Naga Chaitanya | Raj Tarun
     నాగబాబు కూడా

    నాగబాబు కూడా

    ఇక తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. "ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు" అంటూ ఆయన పేర్కొన్నారు. మా అసోసియేషన్ కు నా రాజీనామా నలభై ఎనిమిది గంటల్లో నా స్టాఫ్ ద్వారా పంపిస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్దితో తీసుకున్న నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు .

    English summary
    After Mega brother Naga Babu, actor Prakash Raj announced his resignation from the Movie Artists Association (MAA).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X