ఒక్క తెలుగు ట్వీట్ తో రచ్చ రేపిన ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ, మొదలెట్టాడుగా!

గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారుతున్న ప్రకాష్ రాజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.. నిజానికి ముందు నుంచి మోడీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఉండే ఆయన ఈ మధ్యకాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు.. ఆయన బరిలోకి దిగుతున్నా అని ప్రకటించడంతో లోకల్ నాన్ లోకల్ సమస్య తలెత్తింది. దీంతో పెద్దఎత్తున ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

తాజాగా జరుగుతున్న ఈ వ్యవహారం కారణంగా ఎన్నికలు ఎప్పుడో సెప్టెంబర్ లో ఉండగా ఇప్పుడే రచ్చ మొదయింది. దాదాపు రెండు రోజులకు ఒకసారైనా మా ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. అయితే కొద్ది సేపటి క్రితం ఆయన తెలుగులో ఒక ట్వీట్ చేయడంతో మళ్లీ ఆయన వార్తల్లోకెక్కారు.. ఎలక్షన్స్ ఎప్పుడు...?...... #justasking అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అసలు ఆయన ఏ ఎన్నికల గురించి ప్రస్తావించారు ? అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే తెలుగులో ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవహారమే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

prakash raj tweet in telugu asking about elections

అయితే కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పెద్ద ఎత్తున రచ్చ రేపుతోంది. తప్పు మీది అంటే మీదని అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బహుశా దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేశారేమో అంటూ కొందరు కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి స్పందించి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. అయితే ఆయన దేని గురించి కామెంట్ చేశాడు అనేది ఆయనంతట ఆయన చెబితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X