twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డామినేషన్ చేస్తున్నాడని మహేష్ తొక్కేశాడట.. బయటపడ్డ ఆసక్తికర విషయం

    |

    క్యారెక్టర్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయనెలాంటి వారు? ఆయన నైజం ఎలాంటిదనేది అందరికీ తెలుసు. అయితే తాజాగా మిఠాయి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ బయటపెట్టిన ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది.

    సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఓ మంచి సందేశాత్మక, విలువలతో కూడిన చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజకీయ, సామజిక అంశాలతో పాటు మంచి మెసేజ్ పాస్ చేశారు. ఇందులో మహేష్ బాబుతో కలిసి కమెడియన్ రాహుల్ రామకృష్ణ నటించాడు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో కలిసి నటించే అద్భుత అవకాశం దక్కడంతో పాటు అతనికి ఓ మంచి పాత్ర కూడా లభించింది. రాయలసీమలోని ఒక వెనకబడిన ప్రాంతానికి చెందిన కుర్రాడిగా ఆయన కనిపించారు. పేద కుటుంబంలో పుట్టి సీఎం సాయంతో ఎమ్మెల్యే అవుతారు.

    Prashanth Kumar post going viral in socialmedia on Mahesh Babu issue

    అయితే ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ పాత్రకు సంబందించిన సీన్స్ ఇంకా చాలా ఉన్నాయట వాటిని దగ్గరుండి మరీ మహేష్ బాబే కట్ చేయించారని రాహుల్ అన్నాడట. నటనలో రాహుల్ తనను డామినేట్ చేసుస్తున్నాడని భయపడి మహేష్ ఈ పని చేశారట. తనతో ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ చెప్పాడంటూ ప్రశాంత్ కుమార్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించాడు. ఈ మేరకు రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ గురించి ఆయన పెద్ద పోస్ట్ పెట్టారు.

    కమెడియన్ రాహుల్ రామకృష్ణతో మిఠాయి సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ కుమార్. ఆ సమయంలో రాహుల్ ఈ మాట తనతో చెప్పాడని ఆయన అంటున్నాడు. అయితే రాహుల్ రామకృష్ణది ఒరిజినల్‌గా ఎదుటివారిపై బురద జల్లే క్యారెక్టర్ అని ఆయన పేర్కొనడం విశేషం. రాహుల్ వ్యక్తిత్వం మంచిది కాదని, ఆయన నోరు విప్పితే అన్నీ అబద్దాలే అని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క మహేష్‌ గురించే కాకుండా చాలా మంది ఫిల్మ్ మేకర్స్, నటుల గురించి రాహుల్ చెడుగా చెప్పాడని ప్రశాంత్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. చూడాలి మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్లనుందో.

    English summary
    Actor Rahul Ramakrishna comments mahesh babu on Bharath Ane Nenu movie issue. some of my seens are out from the movie rahul says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X