NBK108: బాలయ్యకు జోడీగా విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఇదేం ట్విస్టు సామీ!

కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అలాంటిది విజయం వస్తే మాత్రం ఆయన మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది.

'వీరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ ఈ మూవీ కాస్టింగ్‌పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించి కొందరు నటీనటులను ఆయన ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

Priyanka Jawalkar Fix for Balakrishna and Anil Ravipudi Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మెయిల్ ఫీమేల్ లీడ్‌గా సోనాక్షి సిన్హా నటిస్తుందని అన్నారు. కానీ, ఆమె ఇందులో నటించడం లేదని స్వయంగా వెల్లడించారు. ఇక, ఈ పాత్ర కోసం ప్రియమణిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో రెండో హీరోయిన్‌గా 'ట్యాక్సీవాలా' ఫేం ప్రియాంక జావాల్కర్‌ను తీసుకున్నారట. ఆమె రోల్ ఇందులో ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, గ్లామర్ షోను కూడా చేయబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలా ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X