For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌కు మరో వారసుడు.. నిర్మాత కుమారుడి హీరోగా మూవీ ప్రారంభం

  |

  శ్రీ మోనికా స్రవంతి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై హరికృష్ణ, ఫిదాగిల్‌, అనూ హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 జూలై 29న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రఘు పతకమూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మురళి శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హరికృష్ణ, హీరోయిన్‌ అనూపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్‌నివ్వగా, దర్శకుడు డైమండ్‌ రత్నబాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను దర్శకుడు రఘు పతకమూరికి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

  ఫస్ట్‌ షాట్‌కు క్లాప్‌నిచ్చిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''కొత్త హీరోలకి, కొత్త దర్శకులకి ఇది మంచి సీజన్‌. కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చి సక్సెస్‌లు అందుకుంటున్నారు. అలాగే కొత్త హీరోలు కూడా వాళ్ళ స్టామినా చూపించి ఆడియన్స్‌ని వారి వైపు తిప్పుకుంటున్నారు. ఈ తరుణంలో వస్తోన్న ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగాకోరుకుంటున్నాను''అన్నారు.

  Producer Murali Srinivas introduces his son Hari Krishna as hero

  కెమెరా స్విచ్చాన్‌ చేసిన దర్శకుడు డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ - ''నా కెరీర్‌ ఇదే అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'సీమశాస్త్రి' సినిమాతో స్టార్ట్‌ అయింది. మళ్ళీ ఇక్కడి నుండే ఒక కొత్త టీం మీ ముందుకు వస్తుంది. ఈ మధ్య కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉంది. కొత్త ఐడియాతో ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్‌ కావాలి. యూనిట్‌కి అల్‌ ది బెస్ట్‌' అన్నారు

  స్క్రిప్ట్‌ అందించిన భాస్కరభట్ల మాట్లాడుతూ - ''మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా ఇది. ఈ కథ మీద పూర్తి నమ్మకంతో పాటలు రాయడానికి ఒప్పుకున్నాను. ప్రస్తుతం నూతన దర్శకులు క్రియేటివ్‌ థాట్స్‌తో మంచి మంచి హిట్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.

  నిర్మాత మురళి శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఈ రోజు మా మోనికా స్రవంతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో మా అబ్బాయి హరిని హీరోగా పరిచయం చేస్తూ నూతన చిత్రం ప్రారంభించాం. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు రఘు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రేక్షకులకి నచ్చే అన్ని అంశాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు''అన్నారు.

  చిత్ర దర్శకుడు రఘు పతకమూరి - ''క్రైమ్‌ కామెడీతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఈమధ్యకాలంలో వచ్చిన థ్రిల్లర్స్‌కి విభిన్నంగా ఉంటుంది. అలాగే మా సినిమాకి ప్రముఖ రచయిత భాస్కరభట్లగారు లిరిక్స్‌ అందిస్తున్నారు. నన్ను సపోర్ట్‌ చేస్తున్న నిర్మాత మురళి శ్రీనివాసరావు గారికి క తజ్ఞతలు. ఆగష్టు 19నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరపనున్నాం. 15 రోజులు హైదరాబాద్‌లో, 20 రోజులు గోవాలో షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

  హీరో హరిక ష్ణ మాట్లాడుతూ - ''ఇక్కడికి వచ్చి నన్ను సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. మంచి కంటెంట్‌తో కూడిన కథ ఇది. రఘు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరూ మంచి ఆర్టిస్టులని, టెక్నీషియన్స్‌ని తీసుకోవడం జరిగింది. మా సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మీ అందరి బ్లెసింగ్స్‌ కావాలి'' అన్నారు. హీరోయిన్‌ ఫిదా గిల్‌ మాట్లాడుతూ - ''ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.

  హీరోయిన్‌ అనూ మెహతా మాట్లాడుతూ - ''కాసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు రఘు, నిర్మాత శ్రీనివాసరావుగారికి థాంక్స్‌'' అన్నారు.

  నటుడు విక్రమ్‌ చారి మాట్లాడుతూ - ''నేను AISFM (అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం మీడియా) స్టూడెంట్‌ని. ఈ సినిమాలో ఎక్కువ మంది మా స్టూడెంట్స్‌ వర్క్‌ చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి'' అన్నారు.

  హరిక ష్ణ, ఫిదాగిల్‌, అనూ, విక్రమ్‌చారి, విజయ్‌, హరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శివప్రసాద్‌, శంకర్‌, అరుణాకర్‌, సినిమాటోగ్రఫీ: అఖిల్‌ వల్లూరి, సంగీతం: జగదీష్‌. ఎడిటర్‌: వెంకీ మునిరాజ్‌, డైలాగ్స్‌: ముప్పూరి శివప్రసాద్‌, శివాని, పాటలు: భాస్కరభట్ల, నిర్మాత: మురళి శ్రీనివాస్‌, దర్శకత్వం: రఘు పతకమూరి.

  English summary
  Production No 1 in Sri Monica Sravanthi Art Productions banner starring Harikrishna, Fidaa Gill, Anu as Hero, Heroines launched today (July 29). Raghu Pathakamuri is getting introduced as the director with this film produced by Murali Srinivas. Pooja ceremony of the film is held out in Annapurna Studios. Director G Nageswara Reddy gave the first clap while director Diamond Rathnababu switched on the camera. Lyricist Bhaskarabhatla handed over the script to the director. Director Raghu Pathakamuri has picturized the first shot on God's photos.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X