Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారీగా నష్టపోయాం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై కోర్టులో పిటిషన్!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇంకా వివాదాల్లో కొనసాగుతున్నది. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా హైకోర్టు ఇచ్చిన స్టేపై సవాల్ చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలంటే సినిమా నిర్మాత సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా డిస్టిబ్యూటర్లు కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. అసలేం జరుగుతున్నదంటే...

రిలీజ్ కాకపోవడంతో నష్టాల్లోకి
లక్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను అడ్డుకొన్నందుకు మేము భారీ నష్టాల్లో కూరుకుపోయాం. అందుకు తగిన న్యాయం చేయాలంటూ నిర్మాత, డిస్టిబ్యూటర్ నట్టి కుమార్‌తో కూడిన ఆల్ ఆంధ్ర ప్రదేశ్ డిస్టిబ్యూటర్ల సంఘం హైకోర్టుకు వెళ్లుతున్నది అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఆల్ ఏపీ డిస్టిబ్యూటర్ల ఆందోళన
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల డిస్టిబ్యూటర్లు కొద్దిరోజులుగా ఆందోళనకు గురవుతున్నారు. భారీ మొత్తానికి ఏరియా హక్కులను సొంతం చేసుకొన్నాం. సినిమా వాయిదా పడటం వల్ల పైరసీ పెరిగి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువు కావోచ్చు. కావున వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలనే విన్నపంతో డిస్టిబ్యూటర్లు కోర్టుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది.

సుప్రీంకోర్టులో నిర్మాతకు ఎదురుదెబ్బ
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఆపివేయడాన్ని సవాల్ చేస్తూ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే త్వరితగతిన కేసును విచారించాలని చేసిన విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరసృరించింది. దాంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై సుప్రీం ఎలా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29 తేదీన ఏపీ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. తెలంగాణలో ఈ సినిమా దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.