For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa 2: క్రేజీ అప్డేట్.. 'పుష్ప 2' అడ్వెంచర్ మొదలు.. బన్నీ కొత్త లుక్ వైరల్

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలోని బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే నార్త్ ప్రజలేకాకుండా విదేశీయులు కూడా వాటిని రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. సైమా అవార్డులను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీకి రానున్న సీక్వెల్ మూవీ 'పుష్ప: ది రూల్' పై అంచనాలు మాములుగా లేవు. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుండా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ఫొటో ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

  ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు..

  ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు..

  ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్ప రాజ్ నటనకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాకు ఫిలీం ఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా, సైమా అవార్డులను కూడా వరించింది. ఇక అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా బన్నీ వ్యవహరించడమే కాకుండా.. ఇటీవల ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.

   అడ్వెంచర్ మొదలైంది..

  అడ్వెంచర్ మొదలైంది..


  సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడుకి అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. అక్టోబర్ 30 అంటే ఇవాళ చిత్రీకరణ పనులు ప్రారంభించింది పుష్ప చిత్రబృందం. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ తాజాగా ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫొటో చూస్తుంటే సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 'అడ్వెంచర్ మొదలైంది. థ్యాంక్స్ టూ ఐకాన్ స్టార్' అంటూ బన్నీతో కలిసి ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

  రెండు నెలలు బ్యాంకాక్ లో..

  పుష్ప 2 సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ షేర్ చేసిన ఈ ఫొటోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. షాట్ కి రెడీగా ఉన్నట్లు బన్నీ కళ్లు చూస్తున్నాయి. అలాగే ఈ పిక్ లో బ్రోజెక్ షాట్ కు సంబంధించిన ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 మూవీ పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడు.. అతనికి వచ్చిన సమస్యలు ఏంటీ.. భన్వర్ సింగ్ షేకావత్ ఏం చేశాడు అనే తదితర ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూపించనున్నట్లు సమాచారం. సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించ రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేస్తారని సమాచారం. అనంతరం రెండు నెలలపాటు బ్యాంకాక్ లో షూటింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అక్కడ షూటింగ్ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.

  English summary
  Icon Star Allu Arjun Pushpa The Rule Movie On Sets Over Cinematographer Post And Bunny Look Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X