Pushpa 3: అల్లు అర్జున్‌కు షాక్ .. గ్లోబల్ స్టార్‌తో చేతులు కలిపిన సుకుమార్
Pushpa 3: దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ నయా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ భారీ విజయం తర్వాత డైరెక్టర్ సుకుమార్ తదుపరి ఏం చేయబోతున్నారన్న ఆసక్తి పెరిగింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన "పుష్ప ది రూల్"తో సక్సెస్ తర్వాత, అభిమానులు సహజంగానే "పుష్ప 3" కోసం ఎదురుచూస్తున్నారు. సుకుమార్ కూడా ఈ సీక్వెల్ ఉంటుందని, వన్‌లైనర్ సిద్ధంగా ఉందని గతంలో స్పష్టం చేశారు. కానీ, తాజా పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఈ లెక్కల మాస్టర్ తన లెక్కలను పూర్తిగా మార్చేశాడు. అల్లు అర్జున్ కి కాదని, తరువాత మరో స్టార్ హీరోతో చేతులు కలుపబోతున్నారంట. ఇంతకీ ఏం జరిగింది?
సుకుమార్-చరణ్ కాంబో రీ-యూనియన్!
తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ "పుష్ప 3" ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టి, ప్రస్తుతం సుకుమార్ పూర్తి దృష్టి రామ్‌చరణ్ ప్రాజెక్ట్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కొత్త పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని, కథాపై చర్చలు పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇది రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో రెండో చిత్రం కానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన "రంగస్థలం" భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ జోడీ కలవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
సుకుమార్-రామ్ చరణ్ కాంబో సినిమాకు నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతం అదే సంస్థ రామ్ చరణ్ నటిస్తున్న "పెద్ది" సినిమాను నిర్మిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న "పెద్ది" 2026 మార్చిలో విడుదల కానుంది. ఆ సినిమా పూర్తయ్యాక, తరువాత నెక్ట్ ఇయర్ (2026)లో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారంట. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుష్ప 3 పై కీలక ప్రకటన చేశారు. తర్వాత పుష్ప3 స్టార్ట్ చేయబోతున్నారా? లేదా? వేరే ఏదైనా క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారని రిపోర్టర్ ప్రశ్నించగా.. తమ తరువతి సినిమా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్టును చేయబోతున్నామని, రామ్ చరణ్ 'పెద్ది'మూవీ కంప్లీట్ అవ్వగానే, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో 2026లో రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని నిర్మాత నవీన్ యెర్నేని వెల్లడించారు. ప్రస్తుత మీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రకటనతో "పుష్ప 3"పై స్పష్టత వచ్చింది. తమ "తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఉంటుంది" అని చెప్పడంతో, పుష్ప 3 సినిమాకు బ్రేకులు పడినట్లేనా అంటూ నిటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు "బన్నీ లెక్కలు సుకుమార్ మార్చేశాడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "పుష్ప 3 తర్వాత సుకుమార్ నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్లిపోయారు" అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ - సుకుమార్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ రాబోయే కాలంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











