టాలీవుడ్‌లోకి భారీ సినీ నిర్మాణ సంస్థ.. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ చేతుల మీదుగా లోగో రిలీజ్
తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి మరో సంస్థ ప్రవేశించింది. సినిమాపై అభిరుచి కలిగిన రాహుల్ చౌదరీ సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఎల్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సినిమా నిర్మాణాలను చేపట్టడానికి ముందుకొచ్చారు. రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేతుల మీదుగా ఈ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఎల్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సినీ, సీరియల్ నటి సుహాసినితో పాటు మరికొందరు నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ చౌదరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన డైనమిక్ పర్సన్. ఎల్.బి ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూపొందే సినిమాలన్నీ అద్భుత విజయాలు సాధించాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ, అభిరుచి కల నిర్మాతగా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకోవాలి అని ఆకాక్షించారు.

నిర్మాత రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. అభిరుచితో కూడిన కథలు, అత్యున్నత నిర్మాణ విలువలకు పెద్ద పీట వేస్తాం. ఈ సంస్థ నుంచి త్వరలోనే మంచి సినిమాలు రాబోతున్నాయి. తొలి అడుగుగా అగ్ర తారలతో భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాం. వీలైనంత త్వరలోనే మా బ్యానర్ పేరు పరిశ్రమలో మార్మోగుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











