For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rahul అంత ఫ్రస్టేషన్ ఎందుకు? ఆ హీరోలను టార్గెట్ చేసి.. చేప్పలేని భూతులతో కృష్ణ కృష్ణ!

  |

  తెలుగులో రాహుల్ రామకృష్ణ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాహుల్ రామకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న నెట్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జి ఫైవ్ యాప్ లో ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల అవుతుండగా ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్

  అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్

  సైన్మా అనే షార్ట్ ఫిలింతో రాహుల్ రామకృష్ణ కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో యాదగిరి అనే పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాలో చిన్న పాత్ర అలాగే శీష్ మహల్ అనే ఒక విడుదల కాని ఒక సినిమాలో కూడా నటించాడు. అయితే వీటన్నిటికీ పెద్దగా పేరు రాలేదు కానీ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుని పాత్రలో నటించాడో ఆ సినిమాతో రాహుల్ రామకృష్ణకు మంచి బ్రేక్ వచ్చింది.

  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ఈ సినిమా దెబ్బతో రాహుల్ రామకృష్ణ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని పడలేదు. వరుసగా భరత్ అనే నేను, ఇంటెలిజెంట్, సమ్మోహనం, హుషారు, మిఠాయి, వంటి చాలా సినిమాలలో ఆయన భాగమయ్యారు. అంతేకాక ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన జాతిరత్నాలు సినిమాలో కూడా రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఆయన కీలక పాత్రలో నటిస్తున్న నెట్ సినిమా ఇప్పుడు పోటీల్లో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధమైంది.

  మా సినిమాకు గు*లో దమ్ముంది

  మా సినిమాకు గు*లో దమ్ముంది

  ఈ సినిమా ట్రైలర్ కూడా కొద్ది రోజుల క్రితం విడుదల కాగా దానికి మంచి స్పందన లభిస్తోంది. ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు, ఫోన్ హాకింగ్ వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో తన సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా ఆయన కాస్త భారీగానే మాటలు తూలుతున్నారు. మా సినిమా 'సినిమా బ్యాక్ గ్రౌండ్' ఉన్న హీరోలకు ఏమాత్రం భయపడదు అని చెబుతూ మా సినిమాకు గు*లో దమ్ముంది అని రెండు సార్లు ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ.

  వాళ్ళ మీద సంచలనం

  వాళ్ళ మీద సంచలనం

  నిజానికి సెప్టెంబర్ 10వ తేదీన విడుదల కాబోతున్న సినిమాల విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. లవ్ స్టోరీ సినిమా అదే రోజున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే, నాని హీరోగా టక్ జగదీష్ సినిమాని అదే రోజు విడుదల చేస్తున్నారు అనే అంశం మీద ప్రెస్ మీట్ ల దాకా వెళ్లి పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాకి సంబంధించిన వాళ్ళు వెనక్కి తగ్గి నానికి ఆ సినిమా యూనిట్ కి కూడా క్షమాపణలు చెప్పిన పరిస్థితి ఉంది..

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
  అంత అవసరమా?

  అంత అవసరమా?

  ఇంత జరుగుతుంటే అదే రోజున సినిమా రిలీజ్ చేస్తున్న రాహుల్ రామకృష్ణ ఇలా బూతులతో విరుచుకుపడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు మా సినిమా ఏ మాత్రం భయపడదు అంటూ కామెంట్ చేయడం దేనికి సంకేతం ఆయనే చెప్పాలి. ఈ సినిమాలో అవికా గోర్ నటన కూడా హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్‌లో రాహుల్ రామకృష్ణ నటన కూడా చాలా బాగుంది. అయితే సినిమాలను ప్రమోట్ చేసుకునే పద్దతి వేరే ఉంటుందని, ఇలాంటి పదాలు వాడి ఏహ్య భావం కలిగేలా చేసుకోవడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

  English summary
  Rahul ramakrishna, avika gor acted in net movie. recently rahul made some abusive comments as promotions on movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X