twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    National Film Awards 2019: జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది.. నాగ్ వెన్నెముకలా : రాహుల్ రవీంద్రన్

    |

    సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం చి.ల.సౌ. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్ట్‌లో సినిమా విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం గత ఏడాది చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది.

    ఈ సందర్భంగా...
    రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - మా చి.ల.సౌ చిత్రానికి బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సందదర్భంగా అమ్మానాన్నకు, నా భార్య చిన్మయికి, నా సోదరుడికి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఉద్యోగం వదిలేసి వచ్చి సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పగానే వాళ్లు ఎంకరేజ్ చేశారు. సపోర్ట్ అందించారు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి స్పెషల్ థ్యాంక్స్. చిన్న సినిమా తీశామని నేను అవార్డ్ కోసం సినిమాను పంపాం ..మరచిపోయాం. కానీ ఇప్పుడు అవార్డ్ రావడం మరచిపోలేని ఆనందాన్ని ఇస్తుంది. సుశాంత్ ఈ సినిమా కథను నమ్మడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది. అలాగే రుహాని శర్మ, సిరుని సినీ కార్పొరేషన్ అధినేతలు సహా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్.

    అలాగే రిలీజ్ సమయంలో నాగ్ గారు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. అదే మాకు పెద్ద ప్లస్ అయ్యి సినిమా రీచ్ పెరిగింది. మాతో పాటు చాలా తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయని విన్నాం. ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమాకు ఇది గొప్ప ఏడాది. తెలుగు సినిమాతో పాటు అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

    Rahul Ravindran about national award winning

    కాగా, ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ అవార్డుల విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 'మహానటి', 'రంగస్థలం', 'అ!', చిలసౌ' చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి.

    English summary
    The winners of the 66th National Film Awards have been announced. While normally, the recipients of the National Film Awards are announced in April and the presentation takes place on May 3 every year, it was delayed this time owing to the Lok Sabha polls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X