Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చుట్టూ అమ్మాయిలు.. చేతిలో మందు .. రాహుల్ జోరు మాములుగా లేదే
బిగ్‌బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఫేమ్ అండ్ నేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లే బ్యాక్ సింగర్‌గా అతి కొద్ది మందికే తెలిసిన రాహుల్.. బిగ్‌బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడయ్యాడు. బిగ్‌బాస్ విజేతగా నిలవడమే కాకుండా.. నిజాయితీగా ఉండి, ఆడి ఎంతో మంది హృదయాలను గెలిచాడు.

హౌస్‌లో హల్‌చల్..
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటరైన దగ్గరి నుంచి తనదైన శైలిలో ముక్కుసూటిగా వెళ్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవిలతో స్నేహం ఏర్పడింది. ఇలా కలిసిన ఆ నలుగురు చివరకు వరకు ఒక్కటిగానే ఉన్నారు. మధ్యలో గొడవలు వచ్చినా.. మళ్లీ ఒక్కటయ్యారు. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్‌తో డీలా పడ్డ ఆ ముగ్గురు రీ ఎంట్రీతో ఎంతో ఆనందంగా ఉన్నారు.

హైలెట్‌గా మారిన కెమిస్ట్రీ..
మూడో సీజన్ మొత్తానికి పునర్నవి, రాహుల్ కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరి మాటలు, తిట్లు, కోపాలు, అలకలు ఇలా ప్రతీ ఒక్కటి వీక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పదే పదే నాగార్జున అనడం.. దానికి వీరిద్దరు సిగ్గు పడటం.. అలాంటిదేమీ లేదని దాటవేయడం అందరికీ తెలిసిందే.
|
ఎంతో మంది కోసుకుంటారు..
హౌస్‌లో ఉన్న సమయంలో పునర్నవికి ప్రపోజ్ చేస్తూ.. తనకోసం కోసుకుని పడి చచ్చే వారు చాలా మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో పునర్నవి కూడా కౌంటర్ వేసినట్టు ఓ చూపు చూసింది. అయితే అది నిజమేనని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తుంటే తెలుస్తోంది.

వీకెండ్ ఫుల్ ఎంజాయ్..
బయటకు వచ్చిన రాహుల్.. తెగ పార్టీలు చేసుకుంటున్నాడు. అప్పటి వరకు మిస్ అయిన ఫ్రెండ్స్ అందరితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీకెండ్‌లోనూ అలానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. తన జీవితంలోని ఫ్రెండ్స్ వీరేనంటూ.. వీకెండ్ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. చేతిలో మందు గ్లాసు పట్టుకుని, చుట్టూ అమ్మాయిలతో ఉన్న రాహుల్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.