For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anubhavinchu Raja Teaser: పరువు కాపాడమంటూ వేడుకున్న రాజ్ తరుణ్

  |

  'ఉయ్యాల జంపాల' అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీతో చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్. మొదటి చిత్రంతోనే భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే 'కుమారీ 21F'తో బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సక్సెస్‌లను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, కొంత కాలంగా అతడు వరుస పరాజయాలతో సతమతం అవుతూనే ఉన్నాడు. దీంతో అతడి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  ఆరంభంలో సత్తా చాటిన రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'అనుభవించు రాజా' అనే మూవీలో నటిస్తున్నాడు. శ్రీను గవిరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంతో సాగుతుంది. ఇందులో జాలీగా తిరిగే చిలిపి కుర్రాడిగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్ అనుకోని కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. అయినప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.

  Raj Taruns Anubhavinchu Raja Movie Teaser Released

  'అనుభవించు రాజా' మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మూవీ ప్రమోషన్‌ను కూడా ప్రారంభించాలని భావించారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా కొద్ది సేపటి క్రితమే 'అనుభవించు రాజా' మూవీ టీజర్ విడుదలైంది. ఈ వీడియోను విడుదల చేసిన కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్, నిర్మాత సుప్రియ, దర్శకుడు శ్రీను గవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  'అనుభవించు రాజా' సినిమా టీజర్‌లో రాజ్ తరుణ్ క్యారెక్టర్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో హీరో కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. భీమవరంలో జరిగే కోడిపందాలకు సంబంధించిన విజువల్స్‌తో ఇది సాగింది. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకు అనుగుణంగానే ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది. ఇక, ఇందులో రాజ్ తరుణ్ చెప్పే 'బంగారం గాడు ఊర్లోని.. వాడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొండు గెలవడం కష్టమెహే' వంటి డైలాగులు మెప్పిస్తాయి.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అనుభవించు రాజా' సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందట. ఇక, ఇందులో అతడికి జోడీగా కశీష్ ఖాన్ నటిస్తోంది. అలాగే, బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. పోసాని కృష్ణ మురళీ, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

  English summary
  Raj Tarun and Kashish Khan Anubhavinchu Raja Movie Under Sreenu Gavireddy Direction. Now This Movie Teaser Released by Ram Charan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X