»   » బ్రహ్మానందం కొడుకు మూవీకి 115 మంది నిర్మాతలు: ‘మను’ ట్రైలర్ అదిరింది!

బ్రహ్మానందం కొడుకు మూవీకి 115 మంది నిర్మాతలు: ‘మను’ ట్రైలర్ అదిరింది!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  బ్రహ్మానందం కొడుకు మూవీకి 115 మంది నిర్మాతలు: ‘మను’ ట్రైలర్ అదిరింది!

  టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం వారసుడిగా హీరోగా తెరంగ్రేటం చేసిన రాజా గౌతమ్.... గతంలో 'పల్లకిలో పెళ్లికూతురు', 'బంసతి' చిత్రాల్లో నటించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత గౌతమ్ మళ్లీ 'మను' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నార్శెట్టి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ హీరోయిన్.

  నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండెడ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంటే ఇందులో 115 మంది పెట్టుబడి పెట్టారట. సినిమా మీద పాషన్ ఉన్న వాళ్లు అంతా కలిసి దర్శకుడిపై నమ్మకంతో 4 రోజుల్లో రూ. 1 కోటి ఫండింగ్ చేశారట. తెలుగు సినిమా చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత మంది భారీ మొత్తం ఫండింగ్ చేయడం ఇదే తొలిసారని టాక్.

  మిస్టరీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మను' ట్రైలర్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగను వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది, ఎక్కువ చక్కెర నాలుకపై తియ్యగానే ఉంటుంది. కానీ, అది రక్తంలోకి కలిశాక గందరగోళం చేస్తుంది...అంటూ సాగు డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

  Raja Goutham

  డైరెక్టర్‌ ఫణీంద్ర మాట్లాడుతూ - ''ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. ఇది నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. కాబట్టి ఇన్వెస్టర్స్‌ను మరచిపోలేను. ఎందుకు నమ్మారో తెలియదు కానీ.. అందరూ ఎంతగానో నమ్మారు.. అయితే ఎవరి నమ్మకాన్ని తగ్గించేలా సినిమా ఉండదని కచ్చితంగా చెప్పగలను అన్నారు.

  రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి, ఆర్ట్‌: శివ్‌కుమార్‌, సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌, సంగీతం: నరేష్‌ కుమారన్‌, నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ(115 మెంబర్స్‌), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్శెట్టి.

  English summary
  Manu is a Telugu feature film, a Mystery Romance Drama, Written and Directed by Phanindra Narsetti, the maker of short films Backspace and Madhuram. Manu is produced by 115 different individuals who are excessively passionate about films which made it the highest and fastest crowd-funded movie ever in the history of Telugu Cinema, raising over 1,00,00,000 INR in 4 days. Cast : Raja Goutham, Chandini Chowdary, John Kottoly, Aberaam, Mohan Bhagath.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more