Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళి మెగా ప్లాన్! వికారాబాద్ అడవుల్లో రామ్‌చరణ్.. ఇదీ అసలు సంగతి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అడవుల్లో పోరాటం చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. పైగా ఎన్టీఆర్ లేకుండానే జక్కన్న ఈ స్కెచ్ వేశారు. ఇంతకీ రాజమౌళి చేసిన ఈ ప్లాన్ ఏంటి? వికారాబాద్ అడవుల్లో రామ్‌చరణ్ ఏం చేస్తున్నట్లు? వివరాల్లోకి పోతే..

రాజమౌళి ఫోకస్ దానిపైనే.. అందుకే ఇలా!
టాలీవుడ్ ఘనత, తోలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న ప్రస్తుతం RRR సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై జక్కన్న ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. ఈ మేరకు లొకేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతూ సన్నివేశానికి తగ్గ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు.

అందుకోసం అడవులను వేదిక చేసుకున్న జక్కన్న
ఈ మేరకు హీరో రామ్ చరణ్‌పై షూట్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం వికారాబాద్ అడవులను వేదిక చేసుకున్నారు రాజమౌళి. RRR టీంతో అక్కడికి వెళ్లిన ఆయన.. రామ్ చరణ్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ అడవుల్లో అడవుల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది.

వారం రోజుల పాటు అడవుల్లోనే..
ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ఎన్టీఆర్ లేకపోవడం విశేషం. కేవలం రామ్ చరణ్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే ఇక్కడ జరుగుతోందట. వారం రోజుల పాటు ఈ అడవుల్లో RRR కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ పార్ట్ షూటింగ్‌తో దాదాపు 80 శాతం షూటింగ్ ఫినిష్ కానుందని టాక్.

అప్పటిలోగా.. రాజమౌళి ప్లాన్స్
ఇప్పటికే ఓ హీరోయిన్ ఆలియా భట్ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేశారు జక్కన్న. సో మిగిలిన షూటింగ్ కూడా త్వర త్వరగా పూర్తిచేసి మార్చి నెల చివరికల్లా మొత్తం కంప్లీట్ చేయాలని రాజమౌళి ప్లాన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత విడుదల వరకూ పోస్ట్ ప్రొడక్షన్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారట.

మెగా, నందమూరి అభిమానులకు నిరాశ
షూటింగ్ ప్రారంభించి చాలా నెలలైనా తన ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి విషయాలు బయటకు రాకుండా RRR విపరీతమైన క్రేజ్ పెంచేశారు రాజమౌళి. ఇదో గొప్ప మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. కనీసం న్యూ ఇయర్ కానుకగా అయినా RRR నుంచి తమ తమ అభిమాన హీరోల లుక్స్ వదులుతారని ఆరాటపడిన మెగా, నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది.

RRR మూవీ.. బ్యూటిఫుల్ హీరోయిన్లు
RRR మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. చారిత్రిక నేపథ్యమున్న సినిమా కావడంతో మెగా, నందమూరి అభిమానులు ఆతృతగా ఉన్నారు.