Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Dhanush మంచి అల్లుడు మాత్రమే కాదు మంచి భర్త కూడా.. రజనీకాంత్ కామెంట్స్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా ప్రయత్నం మొదలు పెట్టిన సమయంలోనే అతనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తన డ్రీమ్ కోసం ఎంతగానో కష్టపడిన ధనుష్ అనుకున్నట్లే సక్సెస్ అయ్యాడు. ఇక పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో కూడా అతను చాలా మంచి వ్యక్తి అని చాలామంది అంటుంటారు. ఇక ఇటీవల హఠాత్తుగా భార్య నుంచి విడిపోతున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్ పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

వివాదాలు బయటకు రాకుండా
ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఇద్దరు కూడా మొదట ఆరు నెలల పరిచయంలోనే చాలా క్లోజ్ అయ్యారు. ఇక ఆ తరువాత 2004లో పాతికేళ్ల వయసులోకి రాకముందే పెళ్లి చేసుకున్న ఈ జంట అందరిని ఆశ్చర్యపరిచారు. ఎన్ని గొడవలు వచ్చినా రూమర్స్ వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు. వివాదాలు బయటకు రాకుండా లోపలే సాల్వ్ చేసుకునేవారు.

ఎందుకు విడిపోయారు?
సోమవారం రాజు అర్ధరాత్రి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు కూడా ఒకేసారి సోషల్ మీడియాలో విడిపోతున్నట్లుగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక వారు ఎందుకు విడిపోయారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరు కూడా వారి సినీ జీవితాల కారణంగా ఫ్యామిలీ లైఫ్ కు సమయాన్ని కేటాయించడం లేదు. ఆ కారణంగా మనస్పర్థలు రావడం వల్లనే ఇద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ చర్చలు..
ఇక ఇటీవల ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళ మీడియాకు ఇచ్చిన క్లారిటీతో ధనుష్ ఐశ్వర్య మళ్ళీ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారని చెన్నై కు వచ్చిన అనంతరం మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రజనీకాంత్ తో కూడా కస్తూరి రాజా మాట్లాడడం జరిగిందట. ఆయన కూడా మరోసారి ధనుష్ ఐశ్వర్య లకు నచ్చజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ మాటల్లో..
అయితే గతంలో రజనీకాంత్ ధనుష్ గురించి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ధనుష్ వండర్ఫుల్ బాయ్. అతను తన తల్లిదండ్రులను గౌరవిస్తాడు, వారిని దేవుడిగా భావిస్తాడు. అతను తన భార్యను చాలా బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, మంచి టాలెంట్ కలిగినవాడు" అని రజనీకాంత్ వీడియోలో పేర్కొన్నారు.
Recommended Video

ఈ వీడియోతో కౌంటర్..
కాలా సినిమా ఆడియో వేడుకలో దనుష్ గురించి రజనీకాంత్ ఈ విధంగా మాట్లాడడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధనుష్ పై నెగిటివ్ ప్రచారాలు చేసే వారికి అతని ఫ్యాన్స్ ఈ వీడియోతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ధనుష్, ఐశ్వర్య ఇద్దరు మళ్ళీ కలుసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధనుష్ ఇటీవల తెలుగులో సార్ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కరోనా కారణంగా మొదలైన మూడు రోజుల్లోనే క్యాన్సిల్ అయ్యింది.