For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shekar Trailer: క్రైమ్ మిస్టరీగా శేఖర్.. అంచనాలు పెంచేసిన రాజశేఖర్

  |

  సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందిన వారిలో యాంగ్రీ హీరో రాజశేఖర్ ఒకరు. పేరుకు తమిళ హీరోనే అయినా టాలీవుడ్‌లో సత్తా చాటిన ఆయన.. ఇక్కడ ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు. ఫలితంగా చాలా విజయాలను ఖాతాలో వేసుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. అలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోయారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే, కొన్నేళ్ల నుంచి సినిమాల్లో వేగం తగ్గించిన రాజశేఖర్.. ఈ మధ్య చాలా తక్కువ ప్రాజెక్టుల్లోనే నటిస్తున్నారు. అవి కూడా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి.

  మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

  వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'గరుడ వేగ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్.. ఆ మధ్య 'కల్కి' తర్వాత మరో చిత్రంలో నటించలేదు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత అంటే కొద్ది రోజుల క్రితమే తన 91వ సినిమాను ప్రకటించారాయన. 'శేఖర్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ క్రైమ్ మిస్టరీ నేపథ్యంతో రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు దీనిపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేశారు. దీంతో రాజశేఖర్ అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

  Rajasekhar Shekar Movie Trailer Released

  'శేఖర్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతోంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడం వల్ల దీన్ని సజావుగా పూర్తి చేయలేకపోయారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. దీంతో లలిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయనను కూడా తప్పించి జీవితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఈ మూవీ ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, కొద్ది రోజుల క్రితమే రాజశేఖర్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుందని స్వయంగా వెల్లడించారు.

  ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!

  రాజశేఖర్ నటిస్తోన్న 'శేఖర్' సినిమాను మే 20న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో పాత్రతో పాటు శివానీ రాజశేఖర్ చేస్తోన్న రోల్‌కు బాగా ప్రాధాన్యత ఇచ్చినట్లు చూపించారు. తన కూతురు (శివానీ)కి అరకులో యాక్సిడెంట్ అవడంతో మాజీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో (రాజశేఖర్) దాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్యాయత్నం అని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అది ఎవరు చేశారు? అన్నది సస్పెన్స్‌గా ఉంచారు. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

  యాంగ్రీ హీరో రాజశేఖర్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'శేఖర్' మూవీని జీవిత తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎల్‌ఎమ్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం‌లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో ఆత్మియా రాజన్, అభినవ్ గోమటం, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.

  English summary
  Tollywood Senior Hero Rajasekhar Now Doing Shekar Movie Under His Wife Jeevitha Direction. Now This Movie Trailer Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X