Don't Miss!
- Finance
markets: ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు ఇంత సమీకరించాయా ? కానీ గతేడాదితో పోలిస్తే..!!
- News
Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అమెజాన్ ప్రైమ్‌లో క్లైమాక్స్ మూవీ.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే!
పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్న డ్రీమ్ మూవీ దర్శకుడు భవానీ శంకర్ డైరక్షన్‌లో నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన క్లైమాక్స్ చిత్రం మార్చి తొలివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. విజయ్ మోడీగా నటించిన రాజేంద్రప్రసాద్ గెటప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలపై, రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలను సంధించిన చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. కరోనావైరస్ కారణంగా థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ శుభవార్తను అందించింది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను సరికొత్తగా, విభిన్నమైన కథ, కథనాలతో, విచిత్ర కాన్సెప్ట్‌తో క్లైమాక్స్ మూవీ రూపొందింది. మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్, బ్యాక్ డ్రాప్ కామెడీతోపాటు కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నాన్ని దర్శకుడు భవానీ శంకర్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

క్లైమాక్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ రెండోవారంలో క్లైమాక్స్ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సాంకేతిక
నిపుణులు
-
నిర్మాణం:
కైపాస్
ఫిల్మ్
ప్రొడక్షన్
హౌస్
నిర్మాతలు:
రాజేశ్వర్
రెడ్డి
,
కరుణాకర్
రెడ్డి
దర్శకత్వం:
భవాని
శంకర్
కే
ఎడిటర్:
బసవ
పైడి
రెడ్డి
మ్యూజిక్:
రాజేష్,
నిద్వాన
సినిమాటోగ్రఫీ:
రవి
కుమార్
నీర్ల
ఆర్ట్
డైరెక్టర్:
రాజ్
కుమార్,
రవి
(ముంబై)
కొరియోగ్రఫీ:
ప్రేమ్
రక్షిత్