దొంగ లెక్కలతో దెబ్బ కొట్టాలనే కుట్ర.. లైవ్‌లో చూపిస్తా.. కే ర్యాంప్ కలెక్షన్లపై నిర్మాత ఫైర్
K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్ కేఎన్, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినిమాపై దుష్ప్రచారం చేస్తున్న అమెరికాకు చెందిన వెబ్‌సైట్‌పై నిర్మాత రాజేశ్ దండా ఘాటుగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
K Ramp చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అయితే ఒక వెబ్‌సైట్ మా మీద పడి ఏడుస్తున్నడు. అమెరికాలోని ప్రదీప్ అనే వాడికి పగిలిపోద్ది. నీకు ఏం తెలుసురా లుచ్చా నా కొడుకా. డ్యూడ్ సినిమాతో కంపేర్ చేసి.. మా సినిమాను తక్కువ చూపిస్తున్నాడు. తప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లు వేస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. నా సినిమాను తొక్కుతావా? నీవు మొగాడివైతే తొక్కురా.. నేను మొగాడిగా చెబుతున్నాను. హిట్ అయిన సినిమాను ఫ్లాప్ అయిందని ఇంకా తప్పుడు రాతలు రాస్తున్నాడు అని నిర్మాత రాజేష్ దండా వార్నింగ్ ఇచ్చాడు.

సినిమా విజయవంతంగా నడుస్తున్న సమయంలో ఫేక్ ఆర్టికల్స్ వేస్తున్నారు. ఈ సినిమాను, చిన్న నిర్మాతను బతకనివ్వరా? మంచి సినిమా తీశాం. చూడమని ప్రేక్షకులను బతిమిలాడుకొంటున్నాం. వారిని చూడమని అడుగుతున్నాం. కానీ అమెరికాలో కూర్చొని మా సినిమాపై దొంగరాతలు రాస్తున్నారు. నేను ఇక్కడ మగాడిలా మాట్లాడుతున్నాను. నేను ఎవడిని అంటున్నానో.. ఎవడు రాస్తున్నాడో వాడికి తెలుసు అని రాజేశ్ దండా అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లోను లైవ్ కలెక్షన్లను చూపిస్తా. మా సినిమాకు ఎంత కలెక్షన్లు వస్తున్నాయో మాకు తెలుసు. కానీ వాడు మాత్రం దొంగ లెక్కలు వేస్తూ మా సినిమాను దెబ్బ తీయాలని చూస్తున్నాడు. మా సినిమాను అంచనా వేయడంలో వాడు ఫెయిల్ అయ్యాడని.. మా సినిమాను టార్గెట్ చేస్తున్నాడు అని రాజేశ్ దండా అన్నారు.
అయితే కే ర్యాంప్ సినిమాపై తప్పుడు రాతలు రాయొద్దు. అందరం ఇక్కడ ఎదగడానికి వచ్చాం. మీడియా వాళ్లు అందరిని సపోర్ట్ చేస్తే నాలాంటి హీరోలు ముందుకు వస్తారు. చాలా మందికి ధైర్యంగా ఉంటుంది. మనమంత కలిసి ఉండాలి. హాయిగా హ్యాపీగా ఉండాలి అని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు.
కే ర్యాంప్ సినిమా బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో సుమారుగా 20 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 4వ రోజు 1.5 కోట్లు ఇండియాలో, 1 కోటి రూపాయలు ఓవర్సీస్‌లో రిలీజ్ చేసింది. దీపావళీ పండుగ రేసులో వచ్చిన చిత్రాల్లో హిట్ చిత్రంగా పేరు తెచ్చుకొన్నది.


Click it and Unblock the Notifications











