For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గొప్ప నటుడివి అనుకుంటున్నావా.. మర్యాదగా బయటకు వెళ్లిపో.. రజనీని అవమానించిన నిర్మాత

  |

  ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ ప్రజలు తమ ఆరాధ్య దైవంగా కొలుచుకునే తలైవాకు.. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల వరకు రజినీకి అభిమానులే. ఆరు పదుల వయసు దాటినా జెట్ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేస్తోన్నాడు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆడియో వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రజినీ మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించాడు.

  అడ్వాన్స్ ఆలస్యం..

  అడ్వాన్స్ ఆలస్యం..

  ‘నటుడిగా నాలుగైదు సినిమాలు చేశాక ఓ నిర్మాత ఫోన్ చేసి తన సినిమాలో వేషం ఉందన్నాడు. నేనే చేయాలన్నాడు. రెమ్యునరేషన్ రూ.6వేలు.. అడ్వాన్స్ వెయ్యి రూపాయలని చెప్పాడు. మరుసటి రోజు కారుతో పాటు అడ్వాన్స్ పంపుతానన్నాడు. ఉదయం ఎనిమిదిన్నరకు రావాల్సిన కారు తొమ్మిది గంటలకు వచ్చింది. అడ్వాన్స్ మాత్రం రాలేదు. డ్రైవర్‌ను అడిగితే.. తెలీదన్నాడు. సెట్‌కు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ అడ్వాన్స్ ఇస్తారన్నారు కానీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని మేనేజర్‌ను అడిగితే.. మేకప్ వేసుకునే టైంకు ఇస్తానని చెప్పారు.

   మర్యాదగా బయటకు వెళ్లిపో..

  మర్యాదగా బయటకు వెళ్లిపో..

  అదేంటి ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు కదా? అని అడిగితే.. తర్వాత ఇస్తామన్నారు. ఆ మాటకు కుదరదన్నాను. అప్పుడే పెద్ద కారులో నిర్మాత దిగారు. అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని చెబుతున్నావట.. నువ్వేమైనా గొప్ప నటుడివి అనుకుంటున్నావా? అడ్వాన్స్ ఇవ్వకపోతే సినిమా చేయనన్నావట. నీలాంటోళ్లను ఎంతమందిని చూసుంటాను. నీకు నా సినిమాలో వేషం లేదు.. మర్యాదగా బయటకు వెళ్లిపో అన్నాడు.

   కోపం బయటకు వచ్చేశాను..

  కోపం బయటకు వచ్చేశాను..

  మీరు పిలిస్తేనే వచ్చాను.. కారులో తీసుకొచ్చిన దానికి నన్ను దాంట్లోనే ఇంటి వద్ద దింపాలని అన్నాడను.. దానికి వారు కుదరదన్నారు.. కోపంతో ఏవీఎం స్టూడియో నుంచి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చేశాను. నన్ను అంతలా అవమానించిన దానికి నేనోంటే చూపించాలని ఫిక్స్ అయ్యాను. నన్ను అన్ని మాటలు అన్నందుకైనా పైకి రావాలని.. పెద్ద కారులో అదే స్టూడియోలోకి వెళ్లాలనని అనుకున్నాను.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  అక్కడే స్టైల్‌గా సిగరేట్..

  అక్కడే స్టైల్‌గా సిగరేట్..

  రెండున్నరేళ్లు బాగా కష్టపడి పేరు.. డబ్బులు సంపాదించిన తర్వాత నాలుగున్నర లక్షలు ఖర్చు చేసి మరీ ఇటాలియన్ మోడల్ కారును కొన్నాను.. రాబిన్ సన్ అనే అంగ్లో ఇండియన్‌ను డ్రైవర్ గా పెట్టుకొని ఫస్ట్ ఏవీయం స్టూడియోకు వెళ్లి.. ఎక్కడైతే ఆ నిర్మాత అవమానించాడో అక్కడే కారును నిలిపి.. బయటకు దిగి స్టైల్‌గా సిగిరెట్లు కాల్చాను. తర్వాత నా గురువు బాలచందర్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇదంతా ఓకే కానీ తనను అంతలా అవమానించిన ఆ నిర్మాత పేరును మాత్రం రజనీ రివీల్ చేయలేదు.

  English summary
  Rajinikanth About Being Insulted By Producer. Darbar Audio Function Celebrated On 8th December. This Movie Is Directed By AR Murugadoss And Music Composed By Anirudh Ravichander.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X