For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్‌కి గాయాలు.. ఆందోళన చెందుతున్న అభిమానులు.. వైద్యులు ఏమన్నారంటే

  |
  Man vs Wild : Rajinikanth's Shoot With Bear Grylls

  తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్ అనుకోకుండా గాయాల పాలవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉండే రజినీకాంత్.. ఇప్పుడు ఓ టీవీ షో కోసం రిస్క్ చేస్తున్నారు. కర్ణాటకలో ఈ అడ్వెంచర్ షో షూటింగ్ జరుగుతుండగా రజినీకాంత్ గాయపడ్డారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? రజినీ గాయాలపై వైద్యులు ఏమన్నారు? వివరాల్లోకి పోతే..

  బందీపూర్ అటవీప్రాంతం.. షూటింగ్ మొదలు

  బందీపూర్ అటవీప్రాంతం.. షూటింగ్ మొదలు

  డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' అనే పాపులర్ అడ్వెంచర్ షోలో ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించనున్నారు. అయితే ఈ ఏడాదికి గాను షో షూటింగ్ కోసం సౌత్ ఇండియన్ స్టేట్ కర్ణాటకకు వచ్చేసింది టీమ్. ఆ రాష్ట్రంలోని బందీపూర్ అటవీప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ షూటింగ్ మొదలుపెట్టారు.

  సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో రజినీ

  సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో రజినీ

  జనవరి 28 మొదలుకొని 30వ తేదీ వరకు ఈ షూట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం బ్రిటన్ దేశానికి చెందిన సాహసవీరుడు బేర్ గ్రిల్స్ కర్ణాటక చేరుకొని రజినీకాంత్‌తో పాటు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  అదుపుతప్పిన రజినీకాంత్.. గాయాలు

  అదుపుతప్పిన రజినీకాంత్.. గాయాలు

  అయితే ఈ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్‌లో పాల్గొన్న రజినీకాంత్ అదుపుతప్పి కిందపడ్డారని, దీంతో ఆయన చేతికి, కాలికి గాయాలయ్యాయని తెలిసింది. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో షూట్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆ షూటింగ్‌ నిలిపివేయడం జరిగింది.

  గాయం తీవ్రత.. అభిమానుల ఆందోళన

  గాయం తీవ్రత.. అభిమానుల ఆందోళన

  గాయం తీవ్రత ఎక్కువగా లేదని, రజినీకి స్వల్ప గాయాలే అయ్యాయని అని వైద్యులు తెలిపారు. దాంతో ఉన్నపలంగా ఆయన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లారు. మరోవైపు తమ అభిమాన హీరో రజినీకి గాయాలయ్యాయని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  ఎలా బతకగలగాలో చూపిస్తూ.. అదే ప్రత్యేకత

  ఎలా బతకగలగాలో చూపిస్తూ.. అదే ప్రత్యేకత

  మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో బేర్ డ్రిల్స్‌తో పాటు ఓ సెలబ్రిటీ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాది ఇదే షోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

  English summary
  Superstar Rajnikant is all set to be seen in Bear Grylls' television show. Rajnikanth is currently in Bandipur Tiger Reserve And National Park, Karnataka with Bear Grylls. In yesterday shoot he was injured.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X