For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Annaatthe First Look: రాయల్ లుక్‌లో రజినీకాంత్.. ఫ్యాన్స్‌కు రెండు పండుగలు

  |

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో హవాను చూపించి.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఆయన.. ఇప్పటికీ తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలా చాలా ఏళ్లుగా సత్తా చాటుతూ వస్తోన్న ఈ స్టార్ హీరో.. కొంత కాలంగా విజయాలను అందుకోవడంలో తడబడుతున్నారు. దీంతో ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారాయన.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  కోలీవుడ్‌ మాస్ చిత్రాల దర్శకుడు శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం 'అన్నత్తే'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగినా.. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా దానికి ఆటంకం ఏర్పడింది. అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత సెకెండ్ వేవ్ వచ్చింది. ఇలా ఈ చిత్రానికి వరుస ఆటకంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్ కూడా మొదలైంది.

  Rajinikanths Annaatthe First Look and Motion Poster Released

  ఎన్నో ఆటంకాల తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న 'అన్నత్తే' ఫైనల్ షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్రారంభించారు. అక్కడ కాళికా దేవి టెంపుల్ ఆవరణలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. అలాగే, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఇక్కడే తీశారని తెలుస్తోంది. వీటితో పాటు సినిమాలోనే ఎంతో హైలైట్‌గా ఉండే ఎమోషనల్ సీన్స్‌ను కూడా చిత్రీకరించారట. ఇక, ఇటీవలే ఈ షెడ్యూల్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది యూనిట్.

  Seetimaarr​ Twitter Review: గోపీచంద్ చాలా రోజుల తర్వాత.. హైలైట్ అదే.. మొత్తంగా ఎలా ఉందంటే!

  వినాయక చవితి కానుకగా ఈరోజు 'అన్నత్తే' మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రజినీకాంత్ తెల్ల చొక్కా, పంచెతో అదిరిపోయేలా దర్శనమిచ్చారు. అంతేకాదు, గుబురు గెడ్డంతో పాటు సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఎంతో స్టైలిష్ గెటప్‌తో కనిపించారు. దీంతో ఈ పోస్టర్‌కు ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. అదే సమయంలో 'అన్నత్తే' మూవీ పేరు, రజినీకాంత్ పేరు ట్విట్టర్‌లో నేషనల్ లెవెల్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.

  అన్నా చెల్లి సెంటిమెంట్‌తో రూపొందిన'అన్నత్తే' మూవీలో రజినీకాంత్ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు అన్నయ్య అనే టైటిల్ పెడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్, రజినీకాంత్‌కు చెల్లెలిగా నటిస్తోంది. ఇక, ఈ మూవీ నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  English summary
  Super Star Rajinikanth Now Doing Annaatthe Movie Under Mass Director Siva Direction. This Movie First Look and Motion Poster Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X