Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
డ్రగ్స్ కేసు: ఆ రోజు రాలేను అని EDకి మెయిల్ పంపిన రకుల్.. హీరోయిన్‌కు నచ్చినట్లుగానే గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరొకసారి ఊహించని విధంగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. 2017లోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. అధికారులు కూడా అంతే వేగంగా విచారణను జరిపారు. రోజుకో కథనాలు టాలీవుడ్ ను అప్పట్లో షేక్ చేశాయి. కానీ ఎందుకో ఏమో కొన్ని రోజులకే ఆ కేసు ముందుకి కదలలేదు. ఫైనల్ గా నాలుగేళ్ళ అనంతరం విచారణను ఎదుర్కొన్న కొందరు ప్రముఖ సెలబ్రెటీలు మరోసారి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు.
మెయిన్ గా డ్రగ్స్ కోసం లావాదేవీలు ఎవరి బ్యాంకు ఖాతా నుంచి వెళ్లాయి అనే కోణంలో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సెలబ్రెటీలలో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆయన బిజినెస్ పాట్నర్, మాజీ హీరోయిన్ ఛార్మి కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరు కావాల్సి ఉండగా ఆమె రీసెంట్ గా అధికారులకు మెయిల్ ద్వారా ఒక వివరణ ఇచ్చారు. ఆమె వినతికి అధికారుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళితే..

ముగిసిన ఛార్మి, పూరి విచారణ
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరికి ప్రత్యేకమైన డేట్స్ ఇచ్చిన ఈడీ అధికారులు అనుకున్న సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశాలను జారీ చేయడమే కాకుండా అందరికి నోటీసులు కూడా పంపారు. గత రెండు రోజులుగా ఒక్కొక్కరుగా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాడనికి ముందుకు వస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక గురువారం పూరి జగన్నాథ్ బిజినెస్ పాట్నర్ అయినటువంటి ఛార్మి కార్ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు
కొద్దిసేపటి క్రితమే ఛార్మి విచారణ ముగిసింది. ఇక ఆ విషయంపై ఛార్మి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. డ్రగ్స్ ఆరోపణలుకు ముందు ఆ తరువాత జరిగిన బ్యాక్ ఎకౌంట్స్ లవా దేవిలపై కూడా పూర్తి ఆధారాలు ఇవ్వాలని అధికారులు వారిని కోరారు. ఇక పూరి, ఛార్మి కూడా అధికారులు అడిగిన విషయాలన్నిటికి సమాధానం చెప్పి తగిన ఆధారాలు కూడా సమర్పించారు. గురువారం ఛార్మి ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు కూడా ఈడీ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారు.

మెయిల్ ద్వారా రకుల్ రిక్వెస్ట్
ఇక భవిష్యత్తులో కూడా అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని ఛార్మి వివరణ ఇచ్చారు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. అయితే ఆమెను సోమవారం విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు అందించగా ఆ విషయంలో రకుల్ ఒక ప్రత్యేకమైన వెసులుబాటును కలిసించాలని మెయిల్ ద్వారా తెలియజేసింది.
Recommended Video

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈడీ
సెప్టెంబర్ 6న విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేయగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 6న విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులకు రకుల్ సమాచారం పంపారు. అయితే కాస్త ముందుగానే తనకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం హాజరు అవుతాను అంటూ రకుల్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. మెయిల్ ద్వారా తన అభ్యర్థన ను ED ఆఫీసుకు పంపడంతో రేపు రావొచ్చని అధికారులు కూడా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు విషయంలో రకుల్ ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటుందో చూడాలి.