Don't Miss!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
RC16: రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీ ప్రకటన.. ఆ కథతోనే రాబోతుందా!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన కథలతో ప్రాజెక్టులు చేస్తూ సత్ఫలితాలను రాబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో వచ్చిన RRRతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా మూవీలు లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్
టాలీవుడ్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరితో చేయడానికి ముందుకు వచ్చాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టును ఆపేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చరణ్ తన 16వ సినిమాను ప్రకటించాడు.

'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన. ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేయబోతున్నాడు. కొద్ది సేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ మేరకు చరణ్ 'దీనిపై ఉత్సుకతతో ఉన్నాను. బుచ్చిబాబు, అతడి టీమ్‌తో కలిసి పని చేయడానికి వేచి చూస్తున్నాను' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా వదిలాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే ఈ సినిమా రాబోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Bigg Boss Nominations: 13వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు తప్ప అంతా.. వాళ్ల మధ్య భీకర ఫైట్

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. ఇక, ఈ సినిమా ద్వారా వెంకటేష్ సతీష్ కిలారు నిర్మాతగా మారుతున్నారు. దీంతో ఆయన వృద్ధి సినిమాస్ బ్యానర్ స్థాపించారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ఆరంభంలోనే ఈ ప్రాజెక్టుపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.