RRRను అలా స్టార్ట్ చేయనున్న రామ్ చరణ్, ఎన్టీఆర్.. అభిమానులకు పండగే!

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫ్యాన్ ఇండియా సినిమా RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటిసారి మెగా నందమూరి అభిమానులు కలిసి నటిస్తున్న యాక్షన్ సినిమా కావడంతో బాహుబలి రికార్డులను కూడా ఈజీగా బ్రేక్ చేయగలదని అంటున్నారు. ఇక సినిమా షూటింగ్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. దీంతో రిలీజ్ పై కూడా అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి.

అసలు మ్యాటట్ లోకి వెళితే సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. చివరిగా ఒక నెల రోజులు కష్టపడితే షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఇక లాక్ డౌన్ ఎత్తివేసిన మరుక్షణం షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మొదట పాటను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో ఉండే ఒక హై వోల్టేజ్ సాంగ్ తోనే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. ఆ సాంగ్ బిగ్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెప్పవచ్చు.

Ram charan and jr ntr RRR shooting start with this plan

సాధారణంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ డ్యాన్స్ తో ఎంతగా ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కరు స్టెప్పులు వేస్తేనే విజిల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఇద్దరు కలిసి సింగిల్ ఫ్రేమ్ లో స్టెప్పులు వేస్తే చూడడానికి రెండు కన్నులు చాలవు.

దానికితోడు కీరవాణి అందించబోయే మ్యూజిక్ ఎలా ఉంటుందన్నది అన్నిటి కంటే పెద్ద సస్పెన్స్. మరి జక్కన్న టీమ్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక సినిమా అక్టోబర్ లో రావడం కష్టమే అని అర్ధమవుతోంది. సంక్రాంతికి కూడా రాకపోవచ్చని అంటున్నారు. ఫైనల్ గా సమ్మర్ కు వస్తుందని అంటున్నారు గాని షూటింగ్ పనులు పూర్తయ్యే వరకు కూడా ఆ కథనాలను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X