ఏక్ Mini కథ టీమ్‌పై రాంచరణ్ ప్రశంసల వర్షం.. మే 27న తప్పకుండా చూడాలి అంటూ!
దివంగత ప్రముఖ దర్శకుడు, వర్షం ఫేం శోభన్ కుమారుడు, యువ హీరో సంతోష్ శోభన్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఏక్ మినీ కథ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకొంటున్నది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం గమనార్హం.
అయితే ఈ సినిమా ట్రైలర్‌ను వీక్షించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏక్ మినీ కథ ట్రైలర్‌ను చూస్తే విభిన్నంగా కనిపిస్తున్నది. కథ, కథనాలను చూస్తే మూవీ యూనిట్ నిజాయితీతో కూడిన అటెంప్ట్ చేశారనే ఫీలింగ్ కలుగుతున్నది. టీమ్ మెంబర్స్‌కు నా బెస్ట్ విషెస్. మే 27వ తేదీన అమెజాన్‌లో రిలీజ్ అవుతున్న ఏక్ మినీ కథను తప్పకుండా చూడండి అంటూ రాంచరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు
దర్శకత్వం: కార్తీక్ రాపోలు
కథ: మేర్లపాటి గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రాఫర్: గోకుల్ భారతి
బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2021-05-27


Click it and Unblock the Notifications











